పాలల్లో నెయ్యి.. ఈ కాంబో తాగితే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
వేడి వేడి పాలల్లో నెయ్యిని కలిపి తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణలు అంటున్నారు. ఫలితంగా శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయంటున్నారు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండటమే కారణం.ఈ ఆహారంతో కేలరీలు సైతం ఎక్కువగానే అందుతాయి. పాలు నెయ్యిని తయారచేస్తుంది. పాలను మరగించి దానిలో తోడు వేస్తే అది కాస్త గట్టిపడి పెరుగుగా మారుతంది. ఆ పెరుగును బాగా చిలికితే వచ్చేదే వెన్న. ఇక వెన్నను వేరు చేసి దాన్ని బాగా మరిగిస్తే వచ్చేది నెయ్యిగా రూపాంతరం చెందుతుంది. బరువు పెరగాలనుకునేవారికి, కండరాల పటిష్ట నిర్మాణానికి పాల పదర్థాలు ఎంతో శ్రేయస్కరంగా గుర్తింపు పొందాయి. పాలు, పాల ఉత్పత్తులు శతాబ్ధాలుగా భారతీయ ఆహారంలో అంతర్బాగమయ్యాయి.
పాలలోని A, D, E, K లాంటి కరిగే విటమిన్లు శరీరానికి పోషకాలు అందేలా చేస్తాయి.
ఆయుర్వేదం ప్రకారం పాలలో నెయ్యిని కలిపి తీసుకోవటం కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ప్రతీతి. 1. శరీరానికి అనేక పోషకాలు 2. పుష్కలమైన ఆరోగ్యకరమైన కొవ్వులు 3. అధిక కేలరీలు 4. బరువు పెరగాలనుకునేవారికి, కండరాల నిర్మాణం 5. నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణ వ్యవస్ధను రక్షిస్తుంది. 6. పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ప్రోత్సాహం 7. పాలతోని నెయ్యి కలిసినప్పుడు ఎముక ఆరోగ్యానికి దోహదం శరీరానికి పాలు,నెయ్యి మిశ్రమంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు , కొవ్వులు కావాల్సినంత శక్తినిస్తాయి. నెయ్యిలోని LDL కొవ్వులు, పాలలోని విటమిన్లు, చర్మంతో పాట జుట్టుకు బలాన్నిస్తాయి. పాలలో A, D, E, K లాంటి కరిగే విటమిన్లు శరీరానికి పోషకాలు అందేలా చేస్తాయి.