Loading...
Viral Gown: ఫ్యాషన్‌ గౌను కాదు.. ప్రసవ వేదనకు ప్రతిరూపంగా నిలిచిన 'లేయర్స్‌ ఆఫ్‌ లైఫ్‌'
ఫ్యాషన్‌ గౌను కాదు.. ప్రసవ వేదనకు ప్రతిరూపంగా నిలిచిన 'లేయర్స్‌ ఆఫ్‌ లైఫ్‌'

Viral Gown: ఫ్యాషన్‌ గౌను కాదు.. ప్రసవ వేదనకు ప్రతిరూపంగా నిలిచిన 'లేయర్స్‌ ఆఫ్‌ లైఫ్‌'

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2026
01:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

అందాల పోటీల వేదికపై ఓ ముద్దుగుమ్మ ధరించిన గౌను ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది. తళుకుబెళుకుల డిజైన్‌తో, పొడవాటి గౌనులో ర్యాంప్‌పై నడిచినా ఆమె చూపించింది కేవలం ఫ్యాషన్‌ను మాత్రమే కాదు.. ఓ తల్లి ప్రసవ ప్రయాణాన్ని కూడా. అమ్మగా మారే సమయంలో మహిళ అనుభవించే మధుర క్షణాలు, భావోద్వేగాలు, ఓ ప్రాణాన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చే అద్భుతాన్ని ఈ డ్రెస్‌ ప్రతిబింబించింది. ప్రపంచ సుందరి పోటీల్లో మిస్‌ ఉగాండా ధరించిన ఈ గౌను మాతృత్వంలోని గొప్పతనాన్ని చాటిచెప్పింది.

వివరాలు 

సీజేరియన్‌ ప్రసవానికి ప్రతిరూపంగా..

బిడ్డకు జన్మనివ్వడం ప్రతి తల్లికీ జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం.

సాధారణ ప్రసవంతో పోలిస్తే సీజేరియన్‌ ద్వారా బిడ్డకు జన్మనివ్వడం మరింత ప్రత్యేకమైన అనుభవం.

శస్త్రచికిత్సలో భాగంగా శరీరంపై ఏర్పడే కోత శాశ్వత మచ్చను మిగిల్చే అవకాశం ఉన్నా..ఆ నొప్పిని భరిస్తూనే ఓ తల్లి కొత్త ప్రాణాన్ని ప్రపంచంలోకి తీసుకొస్తుంది.

ఆ జీవన ప్రయాణంలోని అద్భుతాన్ని కళ్లకు కట్టేలా ఈ గౌనును రూపొందించారు ఉగాండాకు చెందిన డిజైనర్‌ కీషా అబ్దల్లా.

'లేయర్స్‌ ఆఫ్‌ లైఫ్‌' పేరుతో రూపొందించిన ఈ ప్రత్యేక డ్రెస్‌ సీజేరియన్‌ ప్రసవంలో మహిళ ఎదుర్కొనే వివిధ దశలకు కళాత్మక ప్రతిరూపంగా నిలిచింది.

ఫ్యాషన్‌ను కేవలం అందం కోసం కాకుండా ఓ బలమైన సందేశాన్ని చెప్పేందుకు ఉపయోగించవచ్చని ఈ గౌను చాటిచెప్పింది.

వివరాలు 

ఏడు పొరలకు ఏడు రంగులు..

ఈ గౌను వెనుక ఉన్న ఆలోచనను డిజైనర్‌ కీషా అబ్దల్లా తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో వివరించారు.

శరీరాన్ని ఒక ప్రేరణగా తీసుకుని, ఫ్యాషన్‌ను ఒక భాషగా ఉపయోగిస్తే ఇలాంటి ప్రత్యేకమైన సృష్టి ఆవిష్కృతమవుతుందని ఆమె పేర్కొన్నారు.

మహిళ గర్భంలో ఉండే అసాధారణ ఏడు పొరలను ఈ డ్రెస్‌ ద్వారా చూపించినట్లు తెలిపారు.

ప్రపంచంలో మనం ఎక్కడ పుట్టినా, మన చర్మం రంగు ఎలా ఉన్నా.. ప్రతి ఒక్కరూ ఈ పొరలను దాటుకుంటూనే ఈ భూమ్మీదకు వస్తారని ఆమె వివరించారు.

సీజేరియన్‌ ప్రసవంలో చోటుచేసుకునే వివిధ దశలను గౌను ప్రతిబింబిస్తుందని చెప్పారు.

దుస్తుల్లో కనిపించే కదలికలు మాతృత్వంతో ముడిపడిన భావోద్వేగాలు, మహిళ జీవితంలో చోటుచేసుకునే పరివర్తనకు సంకేతాలని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

ర్యాంప్‌పై మిస్‌ ఉగాండా..

మహిళ గర్భంలోని ఒక్కో పొరకు ప్రతీకగా గౌనును పీచ్‌, గోల్డ్‌, కోరల్‌, రెడ్‌, మెరూన్‌, బర్గండీ తదితర రంగులతో తీర్చిదిద్దారు.

ఒక్కో పొర, ఒక్కో రంగు కలిసి ప్రసవం నుంచి మాతృత్వం వరకు సాగే మహిళ ప్రయాణాన్ని ప్రతిబింబించేలా డిజైన్‌ చేశారు.

వియత్నాంలో జరుగుతున్న మిస్‌ వరల్డ్‌ పోటీల్లో మిస్‌ ఉగాండా ట్రివియా ఎల్లీ ముహోజా ఈ ప్రత్యేకమైన గౌనును ధరించి ర్యాంప్‌పై నడిచారు.

ADVERTISEMENT

వివరాలు 

ర్యాంప్‌పై మిస్‌ ఉగాండా..

దీంతో ఈ డ్రెస్‌కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

సాధారణంగా అందాల పోటీల్లో ధరించే దుస్తులు ఆకట్టుకునే డిజైన్లు, రంగులతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి.

అయితే ఈ గౌను మాత్రం అందంతో పాటు ఓ సామాజిక సందేశాన్ని కూడా అందించింది.

తల్లి ప్రసవ అనుభవం, సీజేరియన్‌ సమయంలో ఎదురయ్యే సవాళ్లు, మాతృత్వంలోని భావోద్వేగాలను ఫ్యాషన్‌ రూపంలో అంతర్జాతీయ వేదికపై చూపించిన డిజైనర్‌ కీషా అబ్దల్లాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తల్లి పునర్జన్మకు ప్రతీకగా 'లేయర్స్‌ ఆఫ్‌ లైఫ్‌'.. వైరల్‌గా మారిన గౌను

ADVERTISEMENT