పుస్తకాలు: ఆనంద్ నీలకంఠన్, ఎమిల్ హెన్రీ, కీర్తనా రామిశెట్టి రచయితలు పుస్తకాలు ఏప్రిల్ లో విడుదల
మద్యాహ్నం పూట ఎండ ఎక్కువగా ఉంటే ఇంట్లోనే కూర్చుని, చల్లగా ఏసీ ఆన్ చేసుకుని చేతిలో ఏదో ఒక పుస్తకాన్ని పెట్టుకుంటే ఆ కిక్కే వేరు. పుస్తకం చదివితే మనలో ప్రేరణ కలుగుతుంది. ఆ కిక్కునూ, ఆ ప్రేరణనూ మీరు అనుభవించాలంటే ఏప్రిల్ లో ఏయే పుస్తకాలు రిలీజ్ అవుతున్నాయో చూడాల్సిందే. అద్విక అండ్ హాలీవుడ్ వైవ్స్ - కీర్తన రామిశెట్టి పెళ్ళి, పేరు, మోసం.. మొదలగు అంశాలను తీసుకుని కీర్తన రామిశెట్టి రాసిన ఈ పుస్తకంలో, 26ఏళ్ళ సినిమా రచయిత్రి, తన కంటే రెట్టింపు వయసులో ఉన్న నిర్మాతను పెళ్ళి చేసుకుంటుంది. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయనదే కథ. ఏప్రిల్ 11న ఈ పుస్తకం రిలీజ్ అవుతుంది.
మహాభారతంలోని నల దమయంతి ప్రేమ కథను చెప్పే ఆనంద్ నీలకంఠన్
రొమాంటిక్ కామెడీ - కర్టిస్ సిట్టెన్ ఫీల్డ్ ప్రేమను పూర్తిగా వదిలిపెటేసిన ఒక కామెడీ రైటర్, పాప్ సింగర్ ప్రేమలో ఏ విధంగా పడిపోయిందన్న కాన్సెప్ట్ తో వచ్చిన పుస్తకమే రొమాంటిక్ కామెడీ. ఏప్రిల్ 11వ తేదీన రిలీజవుతోంది. నల దమయంతి - ఆనంద్ నీలకంఠన్ బాహుబలి సిరీస్ రాసిన ఆనంద్ నీలకంఠన్, మహాభారతంలోని దమయంతి కథను చెప్పబోతున్నాడు. విదర్భ రాణియైన దమయంతికి, నిషద రాజైన నలుడికి మధ్య ప్రేమ ఎలా పుట్టిందన్నది ఈ పుస్తకంలో వివరించారు. ఏప్రిల్ 24న రిలీజయ్యే అవకాశం. హ్యాపీ ప్లే - ఎమిలీ హెన్రీ ఒక భార్యభర్తల జంట, తమ జీవితాన్ని కొనసాగించలేక విడిపోతారు. కానీ ఆ విషయాన్ని ఎవ్వరితో చెప్పకుండా ఉంటారు. ఏప్రిల్ 25న విడుదల