
ప్రేరణ: కలల్ని సాధించుకోకుండా రిగ్రెట్ ఫీలవుతూ కూర్చుంటున్నావంటే నీకు వయసైపోయిందని అర్థం
ఈ వార్తాకథనం ఏంటి
వయసు ఉన్నప్పుడే ఏం చేసినా బాగుంటుంది. వయసైపోయాక, అయ్యో ఆ సమయంలో నేనా పని చేసుంటే ఇప్పుడు నా జీవితం ఇలా ఉండకపోయేది కదా అని ఆలోచిస్తే ప్రయోజనం ఏమీ లేదు.
చాలామంది చేసే తప్పే ఇది. తాము సాధించాలనుకున్న దాని వెనక పడకుండా వాయిదా వేస్తూ ఉంటారు. తీరా ఆ వాయిదాలతో సంవత్సరాలు గడిచిపోతాయి. దాంతో పనిచేసే ఓపిక, సత్తువ రెండూ ఉండవు. అలా పశ్చాత్తాపం మొదలవుతుంది.
ఇలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే కలల్ని సాధించుకోవడంలో నిమగ్నమైపోండి. భవిష్యత్తులో రిగ్రెట్స్ ఉండకూడదంటే ఈరోజు వాయిదాలు ఉండకూడదు.
సాధారణంగా యవ్వనంలో ఉండగా చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు చాలా టైమ్ ఉంటుంది.
Details
వయసు పెరిగితే డ్రీమ్స్ తగ్గుతాయి
వయసు పెరుగుతున్న కొద్దీ డ్రీమ్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే పెరిగిన వయసు తెచ్చిన బాధ్యతల కారణంగా సమయమనేది ఉండదు. ఒక మూసలో పడిపోతారు. ఆ మూస దాటి బయటకు రావడం చాలా కష్టం.
కొందరు తమ జీవితం మొత్తంలో ఆ మూసలోనే గడిపేస్తారు. కొంతమంది మాత్రమే మూసను దాటి బయటకు వచ్చి జీవితంలోని ఛాలెంజీలను స్వీకరిస్తారు.
ఎక్కడ రిస్క్ ఉంటుందో అక్కడే రస్క్ ఉంటుంది. మీరు యవ్వనంలో కన్న కలలు మీ వృద్ధాప్యంలో రిగ్రెట్స్ కాకూడదంటే యవ్వనం దాటకముందే డ్రీమ్స్ కోసం పరుగెత్తాలి.
ఆ పరుగులోనే ఆనందాన్ని గ్రహిస్తే మీ జీవితం హాయిగా ఉంటుంది. లేదంటే ఛీ.. దీనమ్మ జీవితం అనుకుంటూ జీవితాంతం గడపాల్సి వస్తుంది.