ప్రేరణ: అవకాశం కోసం చూడడం కన్నా దానికోసం వెతకడమే మంచిది
మీ దగ్గర టాలెంట్ ఉంది. మీరెంతో పని చేయగలరు, కానీ మీ పనిని, టాలెంట్ ని చూపిద్దామనుకుంటే మాత్రం అవకాశం దొరకట్లేదు కదా! ఇలాంటి కంప్లైంట్ మీరు కూడా చేస్తున్నట్లయితే వెంటనే మీ పద్దతి మార్చుకోండి. ఎందుకంటే ప్రపంచం మారిపోయింది. అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా అవకాశాన్ని సృష్టించుకునే వాళ్లే. నీకెంత టాలెంట్ ఉన్నా, ఆ టాలెంట్ ని బయటపెట్టే టాలెంట్ లేకపోతే నీ టాలెంట్ వృధా ఐపోయినట్లే. అవకాశాల కోసం వెతకండి. వస్తుందని ఎదురుచూడకండి. ఇంకో విషయం ఎదురుచూపుల్లో ఏదో వెలితి ఉంటుంది. వెతకడంలో మాత్రం సంతృప్తి ఉంటుందన్న సంగతి గుర్తించండి. ఎదురుచూస్తే దొరుకుతుందో లేదో తెలియదు కానీ వెతికితే మాత్రం అవకాశం దొరుకుతుంది.
అవకాశాలను సృష్టించుకునే టాలెంట్ కారణంగా బయటకొచ్చే నిజమైన టాలెంట్
ఇక్కడ వెతకడం అంటే సృష్టించుకోవడం అని అర్థం చేసుకోవాలి. మారుతున్న కాలంలో మీరు కూడా మారక తప్పదు. ఒకప్పుడు మీలోని టాలెంట్ ని బయటపెట్టడానికి ప్రత్యేకమైన వేదిక అవసరం అయ్యేది. ఇప్పుడు ఏ టాలెంట్ అయినా బయటపెట్టడానికి యూట్యూబ్ లాంటి వేదికలు ఉన్నాయి. అంటే అందరూ యూట్యూబ్ వీడియోస్ చేయాలని కాదు. అవకాశాలను క్రియేట్ చేసుకోవడానికి దార్లు ఉన్నాయని చెప్పడమే ఇక్కడ ఉద్దేశ్యం. ప్రస్తుత ప్రపంచంలో చాలామందికి అవకాశాలు ఎలా వస్తున్నాయో గుర్తిస్తే మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తోంది. అందుకే అవకాశాలను బయటపెట్టే టాలెంట్ ని పెంచుకోండి. ఆ టాలెంట్ మీలో ఎంత ఎక్కువగా ఉంటే, మీ నిజమైన టాలెంట్ ని ఎక్కువ మందికి పరిచయం చేసిన వాళ్లవుతారు.