
ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని ఆలోచించటానికే వెచ్చిస్తుంటే, నీవు దాన్నెప్పటికీ పూర్తి చేయలేవు
ఈ వార్తాకథనం ఏంటి
మీరో పని చేయాలనుకున్నారు. ఎలా మొదలెట్టాలో తెలియట్లేదు. దాని గురించే ఆలోచిస్తూ ఉన్నారు. ఒకరోజు ఐపోయింది. రెండు రోజులు గడిచాయి. మూడు రోజు కూడా ఆ పనిని ఎలా ప్రారంభించాలో అర్థం కావట్లేదు.
ఇలా ఓ పదిరోజులు గడిచాక మీకు మరో అర్జెంట్ పని పడింది. ఇప్పుడు పాత పని వదిలేసారు. కొత్త పని గురించి ఆలోచించడం స్టార్ట్ చేసారు.
పైన చెప్పిన దాంట్లో అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆలోచిస్తూ కూర్చుంటే పనులు పూర్తి కావు. పనిచేయడానికి నడుం బిగిస్తేనే పనులు ముందుకు కదులుతాయి.
ఏ విషయంలోనైనా ఇది వర్తిస్తుంది. మీ దగ్గరికి ఒక పని వచ్చినపుడు దాన్ని మొదలు పెట్టడమే మొదట చేయాల్సిన విషయం. చేస్తూ ఉంటే పనెలా చేయాలో మీకే తెలుస్తుంది.
ప్రేరణ
వందశాతం జ్ఞానం ఎవ్వరికీ సాధ్యం కాదు
అంతేకానీ, ఆ పనెలా చేయాలో ఆలోచిస్తుంటే ఇంచు కూడా ముందుకు కదలదు. మీకేమీ తెలియని పని చేయాల్సిన వచ్చినపుడు ఆ పని గురించి వందశాతం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే, మీరు పని చేయలేరు.
ఎందుకంటే ఏ విషయంలోనైనా ఎవ్వరికీ వందశాతం జ్ఞానం ఉండదు. ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటూ పోవాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే, ఒక పనిని నువ్వు నిజాయితీగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ పనికి సంబంధించిన అవసరమైన విషయాలు నీకు తెలుస్తూనే ఉంటాయి.
ఉదాహరణకు ఒక బావిలో ఈత కొట్టాలనుకుని ఆ బావి గురించి, ఈత ఎలా కొట్టాలనే విషయాల గురించి తెలుసుకున్నంత మాత్రాన నువ్వు నీళ్ళలో నిలబడలేవు.
నీటిలోకి దిగితేనే ఈత వస్తుంది.