ప్రేరణ: నువ్వు చేసే పని రేపటి నీ భవిష్యత్తుకు ఉపయోగపడకపోతే ఈరోజే దాన్ని వదిలెయ్
ఈ వార్తాకథనం ఏంటి
నీకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడు దాని కోసమే నువ్వు రోజూ పనిచేయాలి. నువ్వు చేసే పని నీ లక్ష్యానికి నిన్ను దగ్గర చేయాలి. అలా కాని పక్షంలో ఈరోజు నువ్వు చేస్తున్న పనిని మానేయడమే మంచిది.
లక్ష్యం ఒకటి పెట్టుకుని పని మాత్రం వేరొకటి చేస్తే ఎప్పటికీ నువ్వు హ్యాపీగా ఉండలేవు. అందుకే లక్ష్యం కోసమే పనిచేయాలి. లక్ష్య సాధనలో చిన్న చిన్న మైలు రాళ్ళు కూడా అమితమైన ఆనందాన్ని అందిస్తాయి.
ఇక్కడ మరో విషయం ఏంటంటే, లక్ష్యం కోసం పనిచేయకపోతే నీకు లక్శ్ఃయం దూరమవుతూ ఉంటుంది. ఒకానొక టైమ్ లో నీ కంటికి అస్సలు కనిపించదు. అప్పుడు నువ్వు నీ లక్ష్యం గురించి మర్చిపోతావు.
Details
అడ్డంకులను ఎదుర్కొని వెళ్తేనే లక్ష్యాన్ని చేరగలం
ఉదాహరణకు మీరు హైదరాబాద్ వెళ్ళాలి. మీ ఊరి నుండి 200కిలోమీటర్ల దూరం. కానీ సడెన్ గా హైదరాబాద్ కు వ్యతిరేక దిశలో 100కిలోమీటర్లు వెళ్ళాల్సి వచ్చింది. అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ లక్ష్యం చేరుకోవడానికి 300కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.
అంటే అంతకుముందు కన్నా ఎక్కువ శక్తి అవసరం. కానీ విచిత్రమేంటంటే, 100కిలోమీటర్లు ప్రయణం చేసిన మీరు, 300కి.మీ ప్రయాణం చేయలేరు. తద్వారా హైదరాబాద్ వెళ్ళడాన్నే మానేసుకున్నారు.
లక్ష్యం విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. అందుకే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏం జరిగినా మీ లక్ష్యం కోసమే పనిచేయండి.లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి. అనుకున్నది సాధించడంలో ఆనందాన్ని పొందండి.