
ప్రేరణ: నీ లక్ష్యాన్ని చేరడంలో ఆలస్యమవుతుంటే లక్ష్యాన్ని చేరుకునే దారిని మార్చాలి కానీ లక్ష్యాన్ని కాదు
ఈ వార్తాకథనం ఏంటి
చాలామంది ఎంతో ఇష్టంగా ఒక లక్ష్యం పెట్టుకుంటారు. దానికోసం పనిచేస్తుంటారు. ఆ లక్ష్యాన్ని తొందరగా చేరుకోలేరని వాళ్లకు అర్థమైతే లక్ష్యాన్నే మార్చేసుకుంటారు. వందకు 99మంది ఇదే తప్పు చేస్తుంటారు.
ఇలాంటి వాళ్ళకుఏ విషయంలో పూర్తి నైపుణ్యం ఉండదు. అప్పుడే ఇంజనీరింగ్ చేయాలని, ఆ తర్వాత ఇంజనీరింగ్ పాస్ అవడం కష్టమని డిగ్రీలో జాయిన్ అవుతారు. చివరకు డిగ్రీ కూడా కష్టమైపోయి డిస్ కంటిన్యూ అవుతుంది.
ఆ తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కాదు. మీ లక్ష్యాలను ప్రతీసారీ మార్చుకుంటూ పోతే జరిగేది ఇదే. ఒక లక్ష్యం చేరుకున్న తర్వాత మరో లక్ష్యానికి వెళ్ళడం వేరు. అంతేకానీ, పూర్తి లక్ష్యాన్నే మార్చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు.
Details
గెలిచిన వాళ్ళ జీవితాలను చదవాలి
మీరు సింగర్ కావాలనుకున్నారు. ఎంత ప్రయత్నం చేసినా కాలేకపోతున్నారు? అలాంటప్పుడు ఒకసారి మీ ప్రయత్నాన్ని పరిశీలించుకోండి. ఏ విధమైన దారుల్లో వెళితే సింగర్ అవగలరో తెలుసుకోండి.
ఆల్రెడీ సింగర్స్ అయిన వాళ్ళ జీవితాలను చదవండి. వాళ్లకు మీకూ తేడా ఎక్కడ ఉందో గుర్తించండి. అప్పుడు మీకున్న సమస్యలేంటో మీకు అర్థం అవుతుంది. కొత్త డోర్లు ఓపెన్ అవుతాయి.
ఎక్కువ మంది అర్థం చేసుకోలేనిది ఇక్కడే. వాళ్ళకు అర్థం చేసుకోవాలన్న ఆరాటం కూడా ఉండదు. ఏదో ఒకసారి ప్రయత్నం చేస్తారు. ఫలితం రాకపోయేసరికి అటువైపు చూడటమే మానేస్తారు. ఆ తర్వాత నెపం అంతా జనాల మీద తోసేస్తారు.
మీరలా చేయకండి. కొత్త కొత్త దారుల్లో లక్ష్యాన్ని చేరేందుకు ప్రయత్నించండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది.