
ప్రేరణ: నువ్వేపనీ చేయకపోయినా నీకు డబ్బు వస్తూనే ఉండే వరకూ నువ్వు డబ్బు సంపాదిస్తూనే ఉండు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ప్రపంచంలో మనుషులు అందరికీ అత్యంత ఆవశ్యకమైన అవసరం డబ్బు. డబ్బు లేకుండా బ్రతకొచ్చు అని చెప్పేవాళ్ళకు డబ్బు అవసరం ఉంటుంది.
నిజానికి డబ్బు లేకుండా బతకలేం. డబ్బు రూపం మారుతుందేమో గానీ దాని అవసరం మాత్ర అందరికీ వస్తుంది. డబ్బు కోసం ఖచ్చితంగా పనిచేయాలి. మనం చేసే పనికి ఖచ్చితంగా డబ్బు తీసుకోవాలి.
అయితే డబ్బు సంపాదన విషయంలో చాలామందికి ఒక క్లారిటీ ఉండదు. ఎంత డబ్బు సంపాదించాలో అర్థం కాదు.
మంచి ఇల్లు, పెద్ద కారు, గెస్ట్ హౌస్, సంవత్సరానికి రెండు సార్లు విదేశీ ప్రయాణాలు.. ఇలాంటి సౌకర్యాన్ని ఇచ్చేంత డబ్బుంటే చాలని అనుకుంటారు.
Details
డబ్బే డబ్బుల్ని సంపాదించే స్థితి వరకు కష్టపడాలి
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక దశ దాటిన తర్వాత నువ్వు కష్టపడి డబ్బును సంపాదించకూడదు. నీ డబ్బే నీకు డబ్బుల్ని సంపాదించి పెట్టాలి.
ఎందుకంటే ఒక వయసు వచ్చాక నువ్వు పనిచేయలేవు. అలాంటప్పుడు నువ్వు ఇంకా కష్టపడితే తప్ప డబ్బు సంపాదించలేని స్థితిలో ఉండకూడదు.
వయసు ఉన్నప్పుడే కష్టపడి సంపాదించాలి. నువ్వేమీ చేయలేని పొజిషన్లో ఉన్నప్పుడు నీకోసం నీ డబ్బే సంపాదించాలి. అలాంటి పరిస్థితి వచ్చేవరకు నువ్వు డబ్బు సంపాదించాలి. లేదంటే, డబ్బు పెట్టే ఇబ్బందులను నువ్వు తట్టుకోలేవు.
అందుకే డబ్బు వచ్చే మార్గాలను ఇప్పటి నుండే కనిపెట్టు. కనిపెట్టి చూస్తూ కూర్చోక డబ్బు పని పట్టు. రూపాయి రూపాయి పోగేస్తేనే లక్షలు తయారవుతాయని గుర్తుంచుకో.