Page Loader
ప్రేరణ: గతంలో ఎదురైన ఇబ్బందులను తలచుకుంటూ కూర్చోవడం కన్నా వదిలేయడమే బెటర్ 
మనసును బాధించే గతాన్ని మర్చిపోవడమే ఆనందానికి మార్గం

ప్రేరణ: గతంలో ఎదురైన ఇబ్బందులను తలచుకుంటూ కూర్చోవడం కన్నా వదిలేయడమే బెటర్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 28, 2023
06:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనిషి జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రతీసారీ మనం చేస్తున్న ప్రయాణం సాఫీగా జరగకపోవచ్చు. కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. ఎవరో మిమ్మల్ని అవమానించడం కావచ్చు, లేదా మీరు బాగా నమ్మినవాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు.. మనిషి జీవితంలో ఇలాంటి ఇబ్బందులు సహజమే. అయితే అవమానాలను అందరూ మర్చిపోలేరు. కొందరు వాటిని బాగా సీరియస్ గా తీసుకుని పదే పదే దాని గురించే ఆలోచిస్తుంటారు. అలా ఆలోచిస్తూ బాధపడుతుంటారు. నిజానికి గతం గురించి బాధపడటమే అనవసరం. ఎందుకంటే అదెలాగూ జరిగిపోయింది. అలా ఎందుకు జరిగింది? అలా జరగకుండా ఉండాల్సింది అని మీరు ఆలోచిస్తూ కూర్చుంటే ఎలాంటి లాభం ఉండదు.

Details

గతం గురించి ఆలోచించకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు 

గడిచినపోయిన ప్రతీదీ మీ మంచికే అనుకోండి. దానివల్ల కొన్ని జీవిత సత్యాలు తెలిసాయని సంతృప్తి చెందండి. ఆ ఫీలింగ్ మీకు మంచి ఉపశమనం అందిస్తుంది. మీకు జరిగిన అవమానం మీ వల్లే జరిగిందని ఎదుటివారిని నిందించకండి. మిమ్మల్ని మీరు కూడా నిందించుకోవద్దు. కొన్ని చెడు సమయాల్లో అలా జరిగిపోయిందని మనసును తేలిక చేసుకోండి. గతం గతః.. ఐపోయిన దాని గురించి ఆలోచించడం కన్నా ఈరోజు ఏం చేస్తే మీ మనసు ఆనందంగా ఉంటుందో తెలుసుకోండి. వందేళ్ల జీవితంలో అవమానాలు, విజయాలు, కిందపడటం, పైకి లేవటం కామన్ అని గుర్తించండి. మీరెంత ప్రయత్నించినా గతం తాలూకు ఆలోచనల్లో నుండి బయటకు రాలేకపోతే వెంటనే నిపుణులను కలుసుకోండి.