
ప్రేరణ: అవకాశం రావట్లేదని బాధపడే వారు విజయాన్ని ఎప్పటికీ పొందలేరు
ఈ వార్తాకథనం ఏంటి
మీలో చాలా టాలెంట్ ఉంది. మీరు చాలా బాగా పాడగలరు, మీరు చాలా బాగా రాయగలరు. కానీ మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించట్లేదు. ఎవ్వరూ కూడా మీకు అవకాశాలు ఇవ్వట్లేదు. ఇక్కడ తప్పంతా మీది, ఎందుకంటే ఎవ్వరూ ఎవ్వరికీ అవకాశాలు ఇవ్వరు.
మీలో ఉన్న టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేయడానికి అవకాశాన్ని మీరే సృష్టించుకోవాలి. ఈ ప్రపంచం మీలోని టాలెంట్ ని చూడడానికి రెడీగా ఉంది. అది కూడా మీకు మీరుగా ప్రపంచానికి పరిచయం అయినప్పుడే.
ఎవరో వస్తారనీ, వాళ్ళవల్ల మీ ప్రపంచం మారిపోయి, మీకు అదృష్టం కలిసొచ్చి అవకాశాలు తన్నుకుంటూ వస్తాయని అనుకోకండి. ఇక్కడ ఎవరి స్వార్థాలు వారికున్నాయి. పక్క వాళ్ళకు హెల్ప్ చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంది.
ప్రేరణ
చిన్న వేదికలే పెద్ద వేదికలకు దారి తీస్తాయి
పక్కవాళ్ళకు హెల్ప్ చేయాలనుకునే తక్కువ మంది, మీకు కనిపించిన వారిలో ఒక్కరు కూడా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీరే ఒక అడుగు ముందుకు వేయాలి. ఏం చేస్తే మీలోని టాలెంట్ బయటకు తెలుస్తుందో చూడండి.
అన్ని విధాలా ప్రయత్నించండి. అప్పుడు ఖచ్చితంగా మీ టాలెంట్ ని ప్రదర్శించడానికి మీకో వేదిక దొరుకుతుంది. ఆ వేదిక ద్వారా మరో వేదిక దొరికే అవకాశం ఉంటుంది. అలా పెద్ద వేదిక మీద మీరు కనిపిస్తారు.
ఇదంతా మీరు అవకాశం సృష్టించుకోవడం వల్ల జరుగుతుంది. అవకాశం ఎప్పుడో వస్తుంది కదా అని ఎదురుచూస్తూ ఉంటే సమయం వృధా అవుతుందే తప్ప ఇంచు కూడా ప్రయోజనం ఉండదు. అందుకే అవకాశాల కోసం వెతకొద్దు, క్రియేట్ చేయండి.