NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రేరణ: ఆకాశం అందదని ఆలోచించడం మానేస్తే అంతరిక్షమనే విజయం చేరుకోలేం
    తదుపరి వార్తా కథనం
    ప్రేరణ: ఆకాశం అందదని ఆలోచించడం మానేస్తే అంతరిక్షమనే విజయం చేరుకోలేం

    ప్రేరణ: ఆకాశం అందదని ఆలోచించడం మానేస్తే అంతరిక్షమనే విజయం చేరుకోలేం

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 13, 2023
    05:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒక పని మొదలు పెట్టే ముందు కొన్ని వందల ఆలోచనలు వస్తాయి. ఆ పని పూర్తవుతుందా లేదా? నా వల్ల అవుతుందా కాదా? నేను చేయగలనా లేదా అని అనిపిస్తుంటుంది.

    అలా అనిపించడంలో తప్పు లేదు కానీ, ఆ ఆలోచనను పట్టుకుని పనులను మొదలు పెట్టకపోవడమే తప్పు. పని మొదలు పెట్టక ముందు ఆ పనిచేయడం మనవల్ల కాదేమో అనిపిస్తుంది.

    ఆ టైమ్ లో మీరు పని ఆపేసారనుకోండి. ఖచ్చితంగా మీ వల్ల ఆ పని పూర్తి కాదు, మీకు రావాల్సిన విజయం రాదు. ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతీదీ సాధ్యమే.

    ఒక పని అసాధ్యమైనదని మీకనిపించిందంటే, దాన్ని సాధ్యం చేసే దారుల గురించి మీరు ఆలోచించట్లేదన్నమాట.

    ప్రేరణ

    ఆలోచించడం మానేస్తే అంతరిక్షం చేరుకోలేం

    ఆకాశం అందదని ఆలోచించడం మానేస్తే, ఇప్పటికి కూడా అంతరిక్షాన్ని గుర్తించలేకపోయే వాళ్ళం. చంద్రుడి మీద అడుగు పెట్టకపోయే వాళ్ళం. అంగారకుడి మీద మనుషులున్నారా అని ప్రయోగాలు చేయకపోయేవాళ్ళం.

    ఒక్క సైన్స్ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా ఇది వర్తిస్తుంది. తెలుగు సినిమాకు ఆస్కార్ వస్తుందా? ఛాన్సే లేదనుకున్న చాలామందికి నాటు నాటు పాట ఒక సమాధానంలా నిలిచింది.

    అసాధ్యం అనుకున్న పనులు సాధ్యం చేయాలంటే తెలివి ఉంటే సరిపోదు, తెలివిని తెలివిగా ఉపయోగించడం తెలిసుండాలి. అలాంటప్పుడే ఆస్కార్ అయినా, అంతరిక్షం అయినా ఖచ్చితంగా అందుతుంది.

    అలా మీరు కొత్త ఎత్తులు ఎక్కినపుడు ప్రపంచం మొత్తం మిమ్మల్ని కొత్తగా చూడటం మొదలుపెడుతుంది. మీతో రావడం మొదలు పెడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రేరణ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    ప్రేరణ

    మీకు స్వార్థం ఉందా? ఎలాంటి విషయాల్లో స్వార్థం మంచిదో తెలుసుకోండి నిద్రలేమి
    ప్రేరణ: అడుగు వేస్తేనే దారి, నడక సాగితేనే విజయం లైఫ్-స్టైల్
    ప్రేరణ: సాధించాలన్న సంకల్పం ఉంటే విశ్వం కూడా సాయం చేస్తుంది లైఫ్-స్టైల్
    ప్రేరణ: ప్రయత్నిస్తే పదిరోజుల్లో రాని విజయం వందరోజుల్లో వచ్చే అవకాశం లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025