ప్రేరణ: రిస్క్ తీసుకోవాలనే ఆలోచన నీకు వచ్చిందంటే ఆనందం వైపు అడుగులు వేస్తున్నట్టే
ఈ వార్తాకథనం ఏంటి
రిస్క్ అనే మాటే చాలామందికి రిస్కీగా అనిపిస్తుంది. ఏదో అలా సాగిపోతున్న జీవితాన్ని అనవసరంగా రిస్కులో పెట్టడం ఎందుకని రిస్క్ తీసుకోవడానికి భయపడతారు.
రిస్క్ గురించి భయపడే వారెప్పుడూ ఆనందాన్ని పీక్స్ లో అనుభవించలేరు. చాలీ చాలని బతుకులే చాలనుకునే వాళ్ళకు రిస్క్ తీసుకోవడం గురించి అర్థం కాదు.
ఉదాహరణకు నువ్వు బాగా పాడతావు, ఎప్పుడైనా ఫంక్షన్లలో పాడితే అందరూ మైమరిచిపోతుంటారు. ట్రై చేస్తే సినిమాల్లో పాడగలవని చెబుతారు.
నీక్కూడా నీ టాలెంట్ నిరూపించుకోవాలని ఉంది. కానీ అనవసరంగా అటువైపు వెళ్ళి రిస్క్ తీసుకోవడం ఎందుకులే అనుకుంటే కేవలం ఫంక్షన్స్ లో మాత్రమే పాడాల్సి వస్తుంది.
Details
80ఏళ్ళ వయసులో ఎవరెస్ట్ ఎక్కాలనుకోకూడదు
రిస్క్ తీసుకోవాలన్న ఆలోచన రావడానికే చాలా రిస్క్ చేయాలి. తమకున్న కంఫర్ట్స్ నుండి బయటకు రావాలని ఎవ్వరికీ అనిపించదు. అలా అనిపించినపుడు మీరు గెలవడానికి మొదటి అడుగు పడిందని గుర్తుంచుకోండి.
జీవితంలో ఏది సాధించాలన్నా రిస్క్ చేయాల్సిందే. అయితే రిస్కుతో ఒక సమస్య ఉంది. నువ్వు చేసే రిస్కు నిన్నే తినేస్తే ఆ రిస్క్ వల్ల ఎవరికీ లాభం లేదు.
ఉదాహరణకు 80ఏళ్ళ వయసులో ఎవరెస్ట్ ఎక్కాలనుకోవడం చాలా రిస్క్. అలాంటివి కాకుండా నీకు ఆనందం రావడం కోసం కొన్ని రిస్కులు చేయాల్సిందే.
సో.. జీవితంలో హ్యాపీగా ఉండాలంటే రిస్క్ చేయాలి. ఇంకా హ్యాపీగా ఉండాలంటే మరింత రిస్క్ చేయాలి.