ప్రేరణ: నువ్వు గొప్ప స్నేహితుడైతేనే నీకు గొప్ప స్నేహితులు దొరుకుతారు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత జెనరేషన్ లో బంధాలకు అర్థాలు మారిపోతున్నాయి. అన్నింట్లోనూ స్వార్థం తొంగిచూస్తోంది. మనుషులు అందరూ మనం అనే భావన నుండి నేను అంటూ దూరం జరుగుతున్నారు.
ఫలితంగా ఒంటరితనంతో బాధపడుతున్నారు. స్నేహంలో కూడా స్వార్థం చూపించడం వల్ల ఏకాకిగా మిగిలిపోతున్నారు. ఒంటరివాడెప్పుడూ ఆనందంగా ఉండలేడు.
డబ్బులేకపోయినా పక్కన ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఆనందమే వేరు. అలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు కరువైపోయారని చాలామంది చెబుతారు.
ఇలా చెప్పేవారందరూ తమ గురించి ఆలోచించుకోరు. తమకు సరైన ఫ్రెండ్స్ లేరని బాధపడతారే కానీ తాము ఎంతమందితో ఫ్రెండ్లీగా ఉన్నారో ఆలోచించుకోరు.
ఏదైనా సరే నువ్విచ్చినప్పుడే నీకు దక్కుతుంది. అది ప్రేమైనా, స్నేహమైనా. నువ్వు ఇతరులతో స్నేహంగా ఉంటే నీకు స్నేహం దొరుకుతుంది.
Detaila
స్నేహంలో నిజాయితీ ముఖ్యం
స్నేహితులే మోసం చేస్తారని కొంతమంది అంటుంటారు. అవతలి వారి అంతస్తు చూసి, డబ్బు చూసి, పరువు, ఉద్యోగం మొదలగు లెక్కలన్నీ చూసి స్నేహం చేస్తే మోసాలే ఎదురవుతాయి.
స్వఛ్ఛంగా స్నేహం చేయడం నేర్చుకోవాలి. అవతలి వారికోసం ఏదైనా చేయాలనిపించేంత స్నేహం ఉండాలి. నిజమైన స్నేహితుడు నిన్ను బాధపెట్టాలని ఎప్పటికీ అనుకోడు.
నిన్ను బాధపెట్టే వాళ్ళనుండి పక్కకు జరుగు. వాళ్ళు నీ స్నేహితులు కానే కాదు. ఇక్కడ స్నేహితులంటే నీ వయసుకు సమాన వయసున్న వారే కానవసరం లేదు. నీ పిల్లలు కావచ్చు నీ భార్య కావచ్చు. వాళ్ళతో నువ్వు నిజాయితీగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో స్నేహంగా ఉంటే ఆ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు రావు. వచ్చినా తొందరగా దూరమైపోతాయి.