తాత్కాలిక సుఖం కోరితే శాశ్వత ఆనందం దూరమవుతుంది
రేపు ఇంటర్వ్యూ ఉంది, ఈరోజు బాగా నిద్రొస్తుంది, ఇంటర్వ్యూ గురించి మీకేమీ తెలియదు, కనీసం మీ గురించి చెప్పమన్నా మీరు చెప్పలేరు. ఇలాంటి టైమ్ లో రాత్రి కొంచెం ప్రిపేర్ అయితే బాగుంటుందని మీ మెదడు చెబుతుంది. కానీ మనసేమో నిద్ర బాగా వస్తోంది పడుకోమని అంటోంది. మీరు మనసు చెప్పింది విని, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి పదిహేను నిమిషాలు కూడా ఇవ్వకుండా పడుకుండి పోయారు. తెల్లారి మీరేమీ చెప్పలేకపోయారు. ఉద్యోగం రాలేదు. దాంతో మిమ్మల్ని మీరు చాలా తిట్టుకున్నారు. నిన్నరాత్రి నిద్రపోకుండా ఉండాల్సింది కదా అనుకుని పదే పదే తిట్టుకున్నారు. ఒకవేళ మీరు ఆరోజు ఇంటర్వ్యూకి కొంచెం టైమిస్తే మీరు బాగా చెప్పేవారేమో!
అత్యవసర సమయాల్లో అవసరం లేని సుఖం మీకు నష్టం కలిగిస్తుంది
ఇంటర్వ్యూలో బాగా చెబితే జాబ్ వచ్చేదేమో, ఆ సంతోషంలో ఆరోజు హ్యాపీగా నిద్రపోయేవారేమో.. ఇప్పుడు మీకు అర్థం అయ్యిందా? అందుకే తాత్కాలిక సుఖాలను ఇచ్చే దేనికోసమైనా మీ జీవితాలను పణంగా పెట్టకూడదు. అత్యవసర సమయాల్లో వచ్చే అవసరం లేని సుఖం మీకు నష్టం కలిగిస్తుందే తప్ప లాభం చేకూర్చదు. అందుకే పనిచేసే టైమ్ లో పని చేయాలి, ఎంజాయ్ చేసే టైమ్ లో ఎంజాయ్ చేయాలి. ఈ రెండూ మిక్స్ అయినపుడు మీరు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతారు. అక్కడి నుండి అనేక ఆలోచనలు కలిగి మీలో యాంగ్జాయిటి పెరుగుతుంది. అందుకే మీరో పనిలో ఉన్నప్పుడు అనవసర సుఖాలిచ్చే సంతోషాల వైపు వెళ్ళకండి. దానివల్ల ఒక్కోసారి మీ జీవితమే పాడవుతుంది.