NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రేరణ: అంతా అయిపోయిందనుకోకండి, చీకటి పడ్డ తర్వాతే చంద్రుడు వస్తాడు 
    తదుపరి వార్తా కథనం
    ప్రేరణ: అంతా అయిపోయిందనుకోకండి, చీకటి పడ్డ తర్వాతే చంద్రుడు వస్తాడు 
    అంతా అయిపోయిన తర్వాత కూడా జీవితం మిగిలే ఉంటుంది

    ప్రేరణ: అంతా అయిపోయిందనుకోకండి, చీకటి పడ్డ తర్వాతే చంద్రుడు వస్తాడు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 13, 2023
    05:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జీవితంలో కష్టాలు కామన్. వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని కొన్నిసార్లు కష్టాలనేవి అసలు పోవేమో అనిపిస్తుంటుంది.

    చేస్తున్న వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళిందని బాధపడుతుంటే, అవసరం కోసం మీ దగ్గర అప్పుగా తీసుకున్నవాళ్ళు అప్పు ఎగ్గొట్టి మిమ్మల్ని ఇంకాస్త కష్టాల్లోకి నెడతారు.

    చేతిలో రూపాయి కూడా లేదు. వేరే వ్యాపారం మొదలెట్టాలన్నా కుదరని పని. జాబ్ చేద్దామంటే ఈ ఏజ్ లో జాబ్ ఇచ్చే వాళ్ళు కనిపించట్లేదు.

    ఒకవేళ ఇచ్చినా, వ్యాపారంలో వచ్చిన నష్టాల్ని భర్తీ చేయడానికే అవి సరిపోవడం లేదు. మీ దగ్గర డబ్బు లేకపోయేసరికి మీ భార్యకు మీరు నచ్చడం లేదు.

    సంవత్సరం వరకూ చూసి తన అయిష్టతను మీ మీద కోపం రూపంలో చూపిస్తోంది.

    Details

    జీవితంలో చీకటి ఏర్పడినా కళ్ళు తెరిచే ఉంచాలి. 

    కొన్నాళ్ళకు మిమ్మల్ని వదిలిపెట్టి మీ భార్య వెళ్ళిపోయింది. పిల్లలు మీకు దూరమయ్యారు. ఒంటరిగా మిగిలిపోయారు. మీ పరిస్థితిని చూసి తోటివాళ్ళు మీకు సాయం చేయడానిక్కూడా ముందుకు రావడం లేదు.

    కొందరైతే మీకు ఇలాంటి పరిస్థితే కరెక్ట్ అనుకుంటూ ఆనందపడుతున్నారు. మీరు రోడ్డు మీద నడుస్తుంటే మీ దరిద్రాన్ని చూసి జాలిపడే వారికంటే నవ్వేవాళ్లే ఎక్కువగా ఉన్నారు.

    ఒంటరిగా బ్రతుకుతున్నారు. తల్లీ, తండ్రీ, భార్య, స్నేహం అన్నీ మీకు దూరమైపోయాయి. ఇలాంటి టైమ్ లో జీవితం ఎందుకురా అని అనిపిస్తుండవచ్చు. కానీ అలా అనుకోకూడదు. జీవితంలో చీకటి వచ్చింది కదా అనీ చీకట్లో కలిసిపోవాలని ఆలోచించకూడదు.

    చీకట్లోనూ కళ్ళు తెరిచే ఉంచాలి. అప్పుడే మీకు చంద్రుడి వెలుగు కనిపిస్తుంది.

    Details

    కష్టాల సమయం పూర్తవగానే వచ్చేవి సుఖాలే 

    జీవితంలో అన్నీ కోల్పోయిన మళ్ళీ నిలబడడానికి ఒక అవకాశం తప్పకుండా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఆ అవకాశాన్ని తొందరగా అన్వేషించడమే.

    అమావాస్య వచ్చిందని పౌర్ణమి రాకుండా పోతుందా? జీవితం కూడా అంతే. కష్టాలు మిమ్మల్ని పూర్తిగా కమ్మేసినా భయపడకుండా నడిచిన వాళ్లకే పౌర్ణమి తాలూకు వెలుగు కనిపిస్తుంది.

    అమావాస్య నుండి పౌర్ణమికి 15రోజుల సమయం పడుతుంది. కష్టాలు కూడా అంతే. తొలగిపోవడానికి టైమ్ పడుతుంది. కానీ ఖచ్చితంగా తొలగిపోతాయి.

    మీ జీవితంలో చీకటి ఏర్పడిందని భయపడితే జీవితం చీకటిలో కలిసిపోతుంది. చీకట్లోనూ ముందుకు నడిస్తే వెలుగు దగ్గరవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రేరణ

    తాజా

    IMD: 4-5 రోజుల్లో రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉంది: ఐఎండీ ఐఎండీ
    Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్‌గా గోవింద్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక విశాఖపట్టణం
    Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..  టాలీవుడ్
    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్

    ప్రేరణ

    మీకు స్వార్థం ఉందా? ఎలాంటి విషయాల్లో స్వార్థం మంచిదో తెలుసుకోండి నిద్రలేమి
    ప్రేరణ: అడుగు వేస్తేనే దారి, నడక సాగితేనే విజయం లైఫ్-స్టైల్
    ప్రేరణ: సాధించాలన్న సంకల్పం ఉంటే విశ్వం కూడా సాయం చేస్తుంది లైఫ్-స్టైల్
    ప్రేరణ: ప్రయత్నిస్తే పదిరోజుల్లో రాని విజయం వందరోజుల్లో వచ్చే అవకాశం లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025