ప్రేరణ: నీ శత్రువులను ఎప్పుడూ గమనిస్తూ ఉండు, నీ పొరపాట్లు వాళ్ళకే ఎక్కువ తెలుస్తాయి.
ఈ వార్తాకథనం ఏంటి
మీరు వ్యాపారం చేస్తున్నా, లేక ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా, మీరేం చేసినా మీకు శత్రువులు తయారవుతారు. మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే ఇప్పుడు శత్రువులు పెరిగిపోతున్నారు.
అయితే మీ శత్రువులను గమనిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు చేస్తున్న పనుల్లో లోపాలు వాళ్ళకే ఎక్కువగా తెలుస్తాయి.
మీరు చేసే ప్రతీదీ మీకు నచ్చుతుంది. మీరు కష్టపడి చేయడం మీ దగ్గరవాళ్ళు చూసారు కాబట్టి వాళ్ళు మీ పనిలో లోపాలను ఎత్తిచూపరు.
మీ పోటీదారు, మీ శత్రువు మాత్రమే లోపాలను కనిపెడతాడు. అందుకే మీ శత్రువును మీరు గమనిస్తూ ఉండాలి. వాళ్ళు శత్రువులే అయినా ఒక్కోసారి స్నేహితులు చేయలేని సాయాన్ని చేస్తుంటారు. సాయం చేస్తున్నట్లు వాళ్ళకు కూడా తెలియదు.
Details
శత్రుత్వంతో ఆరోగ్యానికి నష్టం
శత్రువులను గమనించడం మంచిదే. అలా అని అందరినీ శత్రువులుగా మార్చేసుకోవడం మంచిది కాదు. మీరు చేస్తున్న వ్యాపారంలో, పనిలో నిజాయితీగా ఉండండి.
అందరితో శత్రుత్వం పెంచుకోవడం మీ ఆరోగ్యానికి కీడు చేస్తుంది. ఎక్కువ మందితో శత్రుత్వం ఉందంటే తప్పు మీదేనని అర్థం. ఆ తప్పు ఎక్కడ జరుగుతుందో గుర్తించండి. ఎంత తొందరగా గుర్తిస్తే అంత బెటర్. గుర్తించిన వెంటనే సరిచేసుకోండి.
మీ వల్ల తప్పు జరిగినపుడు అవతలి వారికి సారీ చెప్పండి. అది తప్పేమీ కాదు. సారీ చెప్పేసి మనసులో భారాన్ని దించేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.
అలా కాకుండా భారాన్ని మోస్తూ కూర్చుంటే గుండె మీద బరువు పెరుగుతుంటుంది. కాబట్టి కావాలని శత్రువులను తయారు చేసుకోవద్దు.