
ప్రేరణ: ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే మీ మెదడులో పాజిటివ్ ఆలోచనలు ఉండాలి
ఈ వార్తాకథనం ఏంటి
ఆనందాన్ని అన్వేషిస్తే ఎక్కడా దొరకదు. ఎందుకంటే అది నీలోనే ఉంటుంది. నీలో ఉన్న దాన్ని నువ్వు గుర్తించాలి. గుర్తించాలంటే నీ మనసులో పాజిటివ్ ఆలోచనలు ఉండాలి.
మీ మనసంతా నెగెటివ్ ఆలోచనలతో నిండిపోయినపుడు ఆనందం అనేది కనిపించకుండా పోతుంది. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా నిన్ను హ్యాపీగా ఉంచేది నీ ఆలోచనే.
కోట్లు సంపాదించావు, లక్షలు పోగొట్టుకున్నావు. అలాంటి టైమ్ లో నీ దగ్గర మిగిలిన దాన్ని చూసి సంతోషిస్తే, మళ్ళీ కష్టపడే బలం వస్తుంది. లేదంటే మిగిలిన ఆస్తి కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది.
నెగెటివ్ ఆలోచనలు నీ మనసును తినేస్తాయి. నీ మనసు పాడైతే నీ శరీరం పాడవుతుంది. ఆ తర్వాత నువ్వే పాడైపోతావు.
Details
కష్టాలను దాటలనే శక్తిని పాజిటివిటీ ఇస్తుంది
జీవితంలో చాలా సమస్యలు వస్తుంటాయి. కొన్ని మరీ ఇబ్బందిగా ఉంటాయి. ఆ ఇబ్బందులను దాటడానికి పాజిటివిటీ పనిచేస్తుంది.
జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా రేపనేది ఉన్నదన్న ఆలోచన, కష్టాల నుండి బయటపడేసే శక్తినిస్తుంది. అందుకే ఎప్పుడైనా పాజిటివ్ గా ఉండాలి. ఆనందంగా ఉండాలి. ఇంకో విషయం చెప్పాలంటే, ఆనందం అనేది ఛాయిస్.
కొందరు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఏడుస్తారు. ఇంకొందరు అన్ని సబ్జెక్టుల్లో కాకుండా కేవలం రెండింట్లోనే ఫెయిల్ అయ్యారని సంతోషిస్తారు.
ఫస్ట్ ర్యాంక్ ముఖ్యమే. కానీ దానికన్నా ఆనందం ముఖ్యం. ఫస్ట్ ర్యాంక్ వచ్చి బాధపడేవారితో ఉండడం కన్నా రెండు సబ్జెక్టులు ఫెయిలైన వారితో ఉంటే, వారి ఆనందం నీకు చేరి నీ పెదాల మీద చిరునవ్వు వస్తుంది.