ప్రేరణ: కావాలనుకున్నప్పుడు నీ దగ్గరకు రాని సమయం గురించి నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు
మీకు సమయం విలువ తెలిస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. తెలియకపోతే మీకు భవిష్యత్తులో ఇబ్బందులు రావొచ్చు. ఇప్పుడు మీరు ఇరవైల్లో ఉనారనుకుంటే మీ దగ్గర చాలా టైమ్ ఉంటుంది. ఆ టైమ్ ని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ, ఖాళీగా ఏం చేయాలో తెలియక అసలేమీ చేయక ఊరకే వృధా చేస్తే 30ఏళ్ళొచ్చాక ఏదో గొప్పది చేద్దామన్నా కూడా మీ దగ్గర టైమ్ ఉండదు. 30ల్లో కూడా ఎలాగోలా వీలు చేసుకుని టైమ్ మిగుల్చుకుని మీరు చేయాలనుకున్న దాన్ని చేస్తే మంచిది. అప్పుడు కూడా ఆలస్యం చేసారా? నలభైల్లో అనారోగ్యం వల్ల మీరు పనులు చేయకలేకపోవచ్చు. ఆ సమయంలో, అబ్బా 20ఏళ్ళున్నప్పుడు సరిగా సమయాన్ని వినియోగించుకుంటే బాగుండేది కదా అనుకుంటే ప్రయోజనం ఉండదు.
ఆలోచనలకు కార్యరూపం ఇస్తేనే మంచిది
ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే మీ దగ్గరున్న సమయాన్ని సరిగ్గా వాడుకోండి. అనవసరమైన విషయాలపై పెట్టే శ్రద్ధ అవసరమైన వాటిపైన పెట్టండి. ఒక్కసారి సమయం మీ చేతుల్లోంచి జారిపోయిందంటే మళ్ళీ నువ్వెంత ప్రయత్నం చేసినా అది నీ చేతిలోకి రాదు. కాలం వేసే శిక్ష మామూలుగా ఉండదు. కొద్దిగా వయసు వచ్చిన వారిని అడగండి. వాళ్ళకు చాలా చేయాలనుంటుంది. కానీ చేయలేరు. చేయలేక కాదు, టైమ్ లేక. వాళ్ళు చేయాలనుకున్న గొప్ప పనులన్నీ మైండ్ లో ఆలోచనల్లాగే మిగిలిపోతున్నాయి. మీరు మీ మైండ్ ని కేవలం ఆలోచనలతోనే నింపకుండా మీకున్న సమయాన్ని ఉపయోగించి ఆలోచనలకు కొత్తరూపం ఇవ్వండి. ఇలాచేస్తే మీకు మీరే కొత్తగా కనిపిస్తారు.