ప్రేరణ: అందరూ నిన్ను వదిలేసినా నిన్ను నువ్వు వదిలేయకపోతేనే విజయం
ఈ వార్తాకథనం ఏంటి
మనిషి జీవితంలో ఎంతోమందిని కలుసుకుంటాడు. కొంతమంది చాలా తొందరగా మిమ్మల్ని వదిలేస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే మీతో పాటు చివరి దాకా వచ్చే ప్రయత్నం చేస్తారు.
ఆఖరుకు ఒకరు మాత్రమే మీతో చివరి దాకా ఉంటారు. అది మీరే. అవును, మీకు జీవితాంతం తోడుండాల్సింది మీరొక్కరే.
మీకు మీరు తోడు లేనపుడే మీలో నిరాశ, నిస్పృహ ఆవహిస్తుంది. ఈ జీవితం ఎందుకు అని అనిపిస్తుంది. అలా అనిపించకుండా ఉండాలంటే మీకు మీరు తోడుగా ఉండాలి.
మీరు సక్సెస్ లో ఉన్నప్పుడు మీ చుట్టూ చాలామంది చేరతారు. మీ సక్సెస్ లో వాళ్ళు భాగమవుతారు. విషాదంలో మాత్రం మీ దగ్గరకు ఎవ్వరూ రారు. ఇలాంటి టైమ్ లోనే మీకు మీరు తోడుండాలి.
Details
ఈ ప్రపంచం చిన్నది కాదు
ఎవరో మిమ్మల్ని కాదన్నారని, ఎవరో మీ నుండి దూరం జరిగారని, ఇంకెవరో మీతో స్నేహం చేయట్లేదని మీరు బాధపడకండి. ముందుగా మీతో మీరు స్నేహం చేయండి.
మీరు తప్పులు చేసారేమో! వాటిని తలచుకుని బాధపడుతూ, అలా చేసుండకపోతే ఐపోయేది అనుకుంటూ పదే పదే విషాదంలో మునిగిపోకండి.
జరిగిపోయిందేదో జరిగిపోయింది. అలా జరిగిన దానివల్ల మీతో ఇప్పుడు ఎవరూ లేరు. కానీ ప్రపంచం చిన్నది కాదు కదా. ఈ విశాల ప్రపంచంలో మీ వాదన వినేవారు ఒక్కరైనా ఉంటారు. కాబట్టి అందరూ దూరం చేసారన్న ఆలోచనతో ఒంటరిగా ఉండిపోయి బాధలు తెచ్చుకోకండి.
బాధల్ని మర్చిపోయి పనిలో నిమగ్నం అవ్వండి. మీ దగ్గరకు ఒక్కొక్కళ్ళుగా అందరూ వస్తారు.