
ప్రేరణ: అనుకున్నది సాధించాలంటే చదువు, తెలివి కన్నా ముందు ధైర్యం సంపాదించాలి
ఈ వార్తాకథనం ఏంటి
మీరో బిజినెస్ మొదలెట్టాలనుకున్నారు, మీ దగ్గర 10లక్షల రూపాయలున్నాయి. ఏ బిజినెస్ పెట్టాలో డిసైడ్ అయ్యారు. కానీ బిజినెస్ లో నష్టం వస్తుందేమోనన్న భయం మిమ్మల్ని బిజినెస్ పెట్టకుండా ఆపేస్తుంది.
మీరు ఒక స్టేజి మీద పాట పాడాలనుకున్నారు. ఆ పాట మీరు బాగా పాడగలరు, కానీ స్టేజి మీదకు ఎక్కడానికి ధైర్యం చాలడం లేదు.
మీరు జీవితంలో చాలా నష్టపోయారు. ఒక కిడ్నీ ఫెయిలైతే ఇంకో కిడ్నీ మీదే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆ టైమ్ లో లక్ష రూపాయల జీతంతో అమెరికాకు రమ్మని ఆఫర్ వచ్చింది. తోడుగా ఎవరూ లేకపోతే మీ పరిస్థితి ఏమవుతుందోనని మీరు వెళ్ళడం లేదు.
పైన ఉదాహరణలన్నింటిలో కనిపించనిది ధైర్యం ఒక్కటే.
ప్రేరణ
గొప్పవాళ్ళందరూ గొప్ప ధైర్యవంతులే
జీవితంలో ఏది సాధించాలన్నా అన్నింటికన్నా ముందు కావాల్సింది ధైర్యమే. అదే మిమ్మల్ని నడిపిస్తుంది. అదే మిమ్మల్ని గెలిపిస్తుంది. ధైర్యం లేకుండా మీ దగ్గర ఎంత తెలివి ఉన్నా వృధానే.
అందుకే అన్నింటికన్నా ముందు ధైర్యం కూడగట్టండి. చదువు చదివారు. డిగ్రీ ఉంది, కానీ ఏదైనా చేయడానికి ధైర్యం లేకపోతే మీకున్న చదువు, డిగ్రీ అన్నీ వృధానే.
ఒక్క ధైర్యం ఉంటే విజయం మీతో పాటు మీ వెనుకే వచ్చేస్తుంది. ప్రస్తుత కాలంలో ఎంతో మంది గొప్పగా ఎదిగిన వారందరూ పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, అయినా కుడా వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. కారణం కరేజ్.
గొప్పగా కావాలన్న ఆశ మీక్కూడా ఉంటే మీలో గొప్ప ధైర్యం ఉండాలని తెలుసుకోండి.