Page Loader
ప్రేరణ: ఒక పని మీవల్ల కాదని వేరే వాళ్ళు చెబితే మీరు నమ్మారంటే మీ మీద మీకు నమ్మకం లేనట్టే 
ఒక పని మీవల్ల కాదని ఇతరులు చెప్తే అస్సలు నమ్మకండి

ప్రేరణ: ఒక పని మీవల్ల కాదని వేరే వాళ్ళు చెబితే మీరు నమ్మారంటే మీ మీద మీకు నమ్మకం లేనట్టే 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 05, 2023
06:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాధారణంగా జీవితంలో ఎదుటివాళ్ళు ఎక్కువగా సలహాలిస్తూ ఉంటారు. మీరు కొంచెం మెతకగా కనిపిస్తే ఆ సలహాలు ఇంకా ఎక్కువైపోతాయి. మీరేం చేయగలరో లేదో కూడా వాళ్ళే చెప్పేస్తారు. మీ వల్ల ఒక పని కాదని వాళ్లే సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నట్లయితే జాగ్రత్త. ఎందుకంటే మిమ్మల్ని ఎదగకుండా చేసేది వాళ్ళే. ఎవ్వరికైనా సరే తమలో ఎంత మేర శక్తి ఉందొ ఒక్కోసారి తమకే తెలియదు. అంటే మీలో ఎంత శక్తి ఉందో మీకే తెలియదు. మీరు కూడా చేయలేననుకున్న విషయాలను ఒక్కోసారి చేసేస్తుంటారు. అలాంటిది మీ గురించి ఎవరో చెప్పడం, మీరు నమ్మడం అనేది హేయమైన చర్య.

Details

మనిషి ఎప్పుడు షాక్ ఇస్తాడో ఎవ్వరూ చెప్పలేరు 

ఒక మనిషిని పూర్తిగా చదవడమనేది ఎవరి తరము కాదు. ఎందుకంటే మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడు. ఎప్పుడు ఏ విషయం వల్ల ఎలా మారతాడో ఎవ్వరూ చెప్పలేరు. అప్పటిదాకా అల్లరిచిల్లరగా తిరిగిన వాళ్ళు ఐఏఎస్ సాధించి షాక్ ఇవ్వొచ్చు. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడనుకున్న వాళ్ళు పోలీస్ కేసులో ఇరుక్కుపోవచ్చు. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఎవ్వరి గురించి తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా మీ గురించి తక్కువగా అంచనా వేస్తే, ఆ పనిని సక్రమంగా చేసి చూపెట్టండి. అది కూడా అవసరం అనుకుంటేనే. లేదంటే అనవసరంగా అవతలి వాళ్లకోసం మీ సమయం వృధా అయినట్టు అవుతుంది.