ప్రేరణ: నీ జీవితానికి నువ్వు ఓనర్ లా ఉండాలి, మేనేజర్ లా కాదు
ఈ వార్తాకథనం ఏంటి
మనుషులు అందరూ ఈ భూమ్మీదని ఏదో ఒక పనిమీద వచ్చారు. ఇక్కడందరూ ఎవరికి వారే ప్రత్యేకం. ఏ ఇద్దరు కూడా ఒకేలాంటి ఆలోచనలతో ఉండరు. అంతెందుకు సొంత అన్నదమ్ములే వేరువేరుగా ఆలోచిస్తారు.
మరి ఇలాంటి ప్రపంచంలో నీకు నువ్వు సొంతంగా ఆలోచించకుండా అవతలి వాళ్ళ చేతుల్లో నీ నిర్ణయాలను ఎందుకు పెడతావు.
నీకేది ఇష్టమో, నీకేది సాధ్యమో తెలుసుకోకుండా అవతలి వాళ్ళు చెప్పారు కదా అని ఎందుకు ఫాలో ఐపోతుంటావ్?
ఎవరో చెప్పారని నువ్వు డెసిషన్ తీసుకుంటే వాళ్ళ పాటకు నువ్వు డ్యాన్స్ వేసినట్లు అవుతుంది. నీకంటూ ఒక కొత్త పాట ఉండాలి. దాన్ని అవతలి వాళ్ళకు నువ్వు వినిపించాలి. అంటే నీ జీవితానికి నువ్వే ఓనర్ కావాలి.
Details
నిర్ణయాలు తీసుకునే అధికారం ఓనర్లకే ఉంటుంది
ఓనర్లు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. మేనేజర్లు వాటిని అమలు చేస్తారు. నీ జీవితంలోని ఏ నిర్ణయమైనా నీదే కావాలి.
ఇక్కడ ఉద్దేశ్యం సలహాలు తీసుకోకూడదని కాదు, సలహాలు తీసుకోవాలి..తప్పులేదు కానీ ఆ సలహాను పాటించాలా లేదా అన్న నిర్ణయం మాత్రం నీ చేతిలోనే ఉండాలి.
ఓనర్ కు ఛాయిస్ ఉంటుంది. మేనేజర్లకు అది ఉండదు. ఓనర్లుగా ఉన్నప్పుడు లాభమైనా నష్టమైనా నీకే ఉంటుంది. అదే మేనేజర్లుగా అయితే లాభం వచ్చినా ఆనందం ఉండదు. క్రెడిట్ మొత్తం నిన్ను ఎవరైతే శాసిస్తున్నారో వాళ్లకు వెళ్ళిపోతుంది.
అందుకే నీ జీవితంలో తీసుకునే ప్రతీ నిర్ణయం నీదే అయ్యుండాలి. అలాంటప్పుడే ఆ నిర్ణయం వల్ల ఎలాంటి నష్టం వచ్చినా నీకు పెద్దగా కష్టమనిపించదు.