
ప్రేరణ: టాలెంట్ ని ఉపయోగించుకోవడం తెలుసుకోకపోతే అవతలి వాళ్ళు నిన్ను ఉపయోగిస్తారు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ భూమి మీద పుట్టిన ప్రతీ మనిషికి ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చేయాల్సిందల్లా ఆ టాలెంట్ ఏంటో గుర్తించడమే.
అయితే టాలెంట్ ఏంటో గుర్తించగానే పని అయిపోయింది అనుకుంటే పొరపాటు అవుతుంది. నీ టాలెంట్ ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
ఉదాహరణకు నువ్వు పెయింటర్ అనుకుందాం, నువ్వు బొమ్మలు చాలా అందంగా గీస్తావు, ఏ బొమ్మనైనా క్రియేటివ్ గా గీయగలవు. అంత మంచి టాలెంట్ నీ దగ్గర ఉంది.
అయితే ఆ టాలెంట్ ని నీకు పనికి వచ్చేలా నువ్వు చేసుకోకపోతే నీకు ఎంత టాలెంట్ ఉన్నా వృధాగా మిగిలిపోతుంది. నీ టాలెంట్ ని బయటపెట్టినప్పుడే నీలోని టాలెంట్ పెరుగుతుంది.
Details
టాలెంట్ కన్నా దాన్ని ఉపయోగించుకునే టాలెంట్ ఉండాలి
ఎప్పుడైతే నువ్వు నీ టాలెంట్ ని ఉపయోగించుకోవడం మానేస్తావో అప్పుడే అవతలి వాళ్ళు నిన్ను ఉపయోగించుకోవడం మొదలు పెడతారు.
నీలో ఉన్న తెలివిని ఎలా ఉపయోగించాలో నీకు లేకపోయినా అవతలి వాళ్లకు బాగా తెలుస్తుంది, కానీ దానివల్ల నువ్వు చాలా నష్టపోతావ్.
నీ కష్టంతో అవతలివాడు మేడలు కడతాడు, నీకు మాత్రం చేతుల్లో చిల్లర పెట్టి సంతోషించమంటాడు. అందుకే టాలెంట్ ఉండడం గొప్పకాదు, ఆ టాలెంట్ ని ఉపయోగించుకొని అవకాశంగా మార్చుకోవడం గొప్ప.
చాలామందికి ఎంతో గొప్ప తెలివి ఉన్నా, వాళ్లు తమ రంగంలో కావలసినంత సక్సెస్ కాకపోవడానికి కారణం, తమ తెలివితో అద్భుతాలు చేయొచ్చన్న సంగతి, తమలో తమ టాలెంట్ ని సరిగ్గా వాడుకునే టాలెంట్ లేకపోవడమే.