Page Loader
Motivational: యవ్వనంలో చేసే ఈ పొరపాట్లు జీవితాంతం వెంటాడతాయి!
యవ్వనంలో చేసే ఈ పొరపాట్లు జీవితాంతం వెంటాడతాయి!

Motivational: యవ్వనంలో చేసే ఈ పొరపాట్లు జీవితాంతం వెంటాడతాయి!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆచార్య చాణక్యుడిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా పిలవబడే ఆయన భారత చరిత్రలో అతి గొప్ప పండితుడు, తత్వవేత్త, ఆర్థిక శాస్త్రజ్ఞుడిగా నిలిచారు. ఆయనే రచించిన చాణక్య నీతిశాస్త్రం అనే గ్రంథం ద్వారా అనేక జీవనపాఠాలను మానవాళికి అందించారు. ఈ గ్రంథంలోని సిద్ధాంతాలు, సూచనలు నేటి తరానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించినవారు జీవితంలో నిలకడతో పాటు విజయాన్ని సాదించగలుగుతున్నారు. చాణక్యుడు తమ గ్రంథం ద్వారా ప్రతి వ్యక్తి జీవితంలో ఏం చేయాలో,ఏం చేయకూడదో స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా తెలియక చేసిన తప్పులు కూడా ఎంతటి సమస్యలకు దారితీస్తాయో ఆయన హెచ్చరించారు.

వివరాలు 

వినోదాలు, అలసత్వం కోసం ఖర్చు చేస్తే, జీవితాంతం పశ్చాత్తాపడాలి 

ఈ సందర్భంలో యవ్వనంలో చేసే కొన్ని ప్రధానమైన పొరపాట్ల గురించి చాణక్యుడు స్పష్టంగా వివరించారు. ఇప్పుడు అవి ఏంటో చూద్దాం. మొదటిగా, యవ్వనంలో సమయాన్ని నిర్లక్ష్యంగా వృధా చేయరాదని చాణక్యుడు హితవు పలికాడు. ఆ వయసులో చేసిన మంచి పనులు, సమాజానికి చేసిన సేవలు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలవని ఆయన అంటాడు. కానీ అదే సమయాన్ని వినోదాలు, అలసత్వం కోసం ఖర్చు చేస్తే, జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అందుకే యవ్వనాన్ని విలువైనదిగా భావించి ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పాడు. అలాగే, డబ్బును నిర్లక్ష్యంగా ఖర్చు చేయడం కూడా తప్పని సూచించాడు.

వివరాలు 

కెరీర్ విషయంలో యవ్వనంలో దృష్టి పెట్టకపోవడం కూడా తీవ్రమైన తప్పు

యవ్వనంలో ఆలోచన లేకుండా ఖర్చులు చేస్తే, వృద్ధాప్యంలో దాని ప్రభావం అనుభవించక తప్పదు. ఆర్థికంగా బలహీనత ఎదురై, పేదరికంలో మునిగిపోవడం వల్ల మానసిక ప్రశాంతత లేకుండా పోవచ్చు. జీవితాంతం ఆర్థిక సమస్యల నుంచి బయటపడలేని పరిస్థితి ఎదురవుతుంది. అందుకే డబ్బును జాగ్రత్తగా వినియోగించాలన్నది ఆయన బోధన. మూడవది, కెరీర్ విషయంలో యవ్వనంలో దృష్టి పెట్టకపోవడం కూడా తీవ్రమైన తప్పు అని చెప్పారు. సరదా జీవితానికి అలవాటుపడి, ప్రొఫెషనల్ లక్ష్యాలను నిర్లక్ష్యం చేయడం వలన జీవితాంతం పశ్చాత్తాపానికి గురవవలసి వస్తుంది. అందుకే ఈ వయసులోనే సరైన దిశలో కెరీర్‌ను నిర్మించుకోవాలని సూచించారు.

వివరాలు 

చెడు సహవాసం మన విలువలు, వ్యక్తిత్వాన్ని చెరిగిపోయేలా చేస్తుంది 

చివరగా, చెడ్డ స్నేహితులతో గడపడం కూడా జీవితానికి అపరిష్కార సమస్యలను తెచ్చిపెట్టవచ్చని చాణక్యుడు హెచ్చరించారు. చెడు సహవాసం మన విలువలు, వ్యక్తిత్వాన్ని చెరిగిపోయేలా చేస్తుందని, అది జీవితాంతం బాధ కలిగించేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి యవ్వనంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకొని ఎప్పుడూ మంచి సహవాసాన్ని కొనసాగించాలని సూచిస్తున్నాడు.