వీ-షేఫ్ బాడీ కోసం పెంచాల్సిన కండరాలు, చేయాల్సిన ఎక్సర్ సైజులు
ప్రతీ ఒక్కరూ తమ బాడీ వీ-షేప్ లో ఉంటే బాగుంటుందని అనుకుంటారు. అలాంటప్పుడు వీపు కండరాల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏ కండరాలకు ఎలాంటి ఎక్సర్ సైజ్ చేస్తే మీరనుకున్నట్టు వీ-షేప్ లోకి బాడీ వస్తుందో తెలుసుకోండి. లాటిస్సిమస్ డోర్సి: లాట్స్ అని పిలవబడే ఈ కండరాలు వీపుకింది మధ్యభాగంలో ఉంటాయి. రోయింగ్, పుల్ అప్, చిన్-అప్ ఇంకా ఈతకొట్టే సమయంలో ఈ కండరాల మీద బలం పడుతుంది. శరీరం వీ-షేప్ లో కనిపించాలంటే పైన చెప్పిన పనులు ఎక్కువగా చేయాలి. ట్రేప్జియస్: డైమండ్ ఆకారంలో అతిపెద్ద కండరం, మెడభాగం నుండి వీపు మధ్యవరకు ఉంటుంది. ఎక్కువ బరువులను మోసే సమయంలో వీటిమీద బలం పడుతుంది కావున, డంబెల్ రోస్ చేయాలి.
వీ-షేప్ బాడీ కోసం పెంచాల్సిన కండరాలు
రోంబైడ్స్: భుజాల బ్లేడ్ లకు మధ్యగా ఉండే ఈ కండరాలు, భుజాలను అటు ఇటు తిప్పడంలో ఉపయోగపడతాయి. ఈ కండరాలు పెరగడం వల్ల మీ శరీర ఆకృతి అందంగా కనిపిస్తుంది. డంబెల్ రోల్స్, పుల్-అప్స్, రోంబైడ్ ఎక్సర్ సైజెస్ చేయాలి. ఎరెక్టర్ స్పైనీ: పుర్రె భాగం నుండి వెన్నెముక చివరి భాగం వరకు ఉండే చిన్న కండరాల సముదాయాన్నే ఎరెక్టర్ స్పైనీ అంటారు. ముందుకు, వెనక్కు, పక్కలకు వంగడం వీటి ద్వారానే సాధ్యమవుతుంది. డెడ్ లిఫ్ట్, రష్యన్ ట్విస్ట్, ఎక్సర్ సైజెస్ వల్ల కండరాలు పెరుగుతాయి. లీవేటర్ స్కేపులే: భుజమును పైకి లేపాలంటే, తిప్పాలంటే, ఎటు కదలకుండా ఉంచాలన్నా ఈ కండరం ఉపయోగపడుతుంది. షోల్డర్ బ్లేడ్ స్క్వీజ్ ద్వారా ఈ కండరాలు బలపడతాయి.