
ఎక్కువ మందికి తెలియని అతి పురాతనమైన వింతగా ఉండే సంగీత సాధనాలు
ఈ వార్తాకథనం ఏంటి
సంగీత సాధానాల్లో చాలా రకాలున్నాయి. వాటిల్లో కొన్నింటికి మంచి గుర్తింపు ఉంది. కొన్నింటికి మాత్రం అసలు గుర్తింపు లేదు. ఇంకా చెప్పాలంటే ఆ సంగీత సాధనాల గురించి ఎవ్వరికీ తెలియదు.
ప్రస్తుతం ఎక్కువ మందికి తెలియకుండా మిగిలిపోయిన సంగీత సాధనాలు ఏంటో తెలుసుకుందాం.
ద డాన్ ట్రి:
ఈ సాధనాన్ని వియత్నాం శరణార్థుడు మిన్ టామ్ ఎన్గుయేన్ తయారు చేసాడు. వియత్నాం యుద్ధ సమయాల్లో లేబర్ క్యాంపుల్లో నివాసమున్న సమయంలో దీన్ని తయారు చేసాడు.
ఈ సాధనంలో యూరప్, ఆసియా దేశాల సంగీత సంప్రాదాయాలు మిళితమై ఉన్నాయి. క్యాంపులో దొరికిన వెదురు కర్ర, శబ్దం రావడానికి ఆలివ్ ఆయిల్ ఉండే పెద్ద డబ్బా, కంపనాలు చేయడానికి తీగలుగా 23టెలిఫోన్ కేబుల్స్ ఉంటాయి.
Details
సుత్తితో కొడితేనే సంగీతం
రావణహత
శ్రీలంకకు చెందిన ఈ సాధనం, రావణాసురుడి కాలానికి చెందినదని నముతారు. మేకతోలుతో కప్పబడిన కొబ్బరి చిప్ప, వెదురు కర్ర, రెండు తీగలు ఉంటాయి. ఈ తీగల్లో ఒకటి ఉక్కు(స్టీల్)తో తయారవగా, మరొకటి గుర్రపు వెంట్రుకతో తయారవుతుంది.
రాజస్థాన్ లో ఈ సంగీత సాధనాన్ని ఇప్పటికీ వాడుతుంతారు.
ఎర్హు:
మంగోలియా మూలాలు కలిగిన ఈ చైనీస్ సాధనాన్ని మీటితే వయొలిన్ వాయించినట్టుగా సంగీతం వినిపిస్తుంది. ఈ సాధనాన్ని వేల సంవత్సరాల క్రితం తయారు చేసినట్లు చెబుతారు.
సింబలోమ్:
హంగేరీకి చెందిన మధ్య యుగ కాలం నాటి సంగీత సాధనంగా చెప్పుకుంటారు. దీనికి 125 తీగలు ఉంటాయి. ఈ సాధనాన్ని వాయించాలంటే సుత్తివంటి చెక్క వస్తువులతో కొట్టాల్సి ఉంటుంది.
Details
గ్లాస్ హార్మోనికా:
1761సంవత్సరంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈ సంగీత సాధనాన్ని కనిపెట్టాడు. ఈ సాధనంలో వివిధ రకాల సైజుల్లో ఉండే గ్లాసులు, వాటిలో ద్రవాలతో నిండి ఉంటాయి.
ఈ గ్లాసులన్నీ ఒకదానిలో ఒకటి అమరిపోతూ ఒక కుదురుపై ఉంటాయి. ఈ గ్లాసు అంచుల మీద వేళ్ళతో తాకినపుడు ఈ సాధనం నుండి సంగీతం వస్తుంది. ఇప్పటికీ ఈ సాధనాన్ని వాడుతున్నారు.