అంతర్జాతీయ సంగీత దినోత్సవం: శరీరానికి, మనసుకు సంగీతం వినడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ప్రపంచంలో దేనినైనా కదిలించే శక్తి సాహిత్యాని,కి సంగీతానికి మాత్రమే ఉందని అంటారు. సాహిత్యం గురించి పక్కనపెడితే, ఈరోజు అంతర్జాతీయ సంగీత దినోత్సవం.
సంగీతం వినడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
బ్యాక్ గ్రౌండ్ లో ఒక మంచి పాట ప్లే అవుతుంటే మీ శరీరంలో రక్త ప్రసరణ చాలా సాఫీగా జరుగుతుంది. అంటే గుండె కొట్టుకునే వేగం సాధారణ స్థాయికి చేరుతుంది. సంగీతం వినడం వల్ల శరీరంలో సెరటోనిన్, ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి.
నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది
శరీరంలో నొప్పులు మిమ్మల్ని బాధిస్తుంటే మీకు నచ్చిన మ్యూజిక్ వింటే నొప్పి తీవ్రత తగ్గిపోతుంది.
Details
హ్యాపీ హార్మోన్స్ వల్ల హ్యాపీగా నిద్ర
డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది
బాధ ఎక్కువైనప్పుడు మనసంతా భారంగా మారిపోతుంది. మంచి మ్యూజిక్ వినడం వల్ల ఆ భారం దిగిపోయి మనసు తేలిక పడుతుంది.
నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది
ఇంతకుముందే చెప్పినట్టు మ్యూజిక్ వినడం వల్ల హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. వీటివల్ల మీ మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో అప్పుడు కళ్ళ మీదకి నిద్ర వస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది
ఒకానొక పరిశోధనలో వెల్లడైన ప్రకారం మ్యూజిక్ వినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
వర్క్ అవుట్ చేసే సామర్థ్యం పెరుగుతుంది
పొద్దున లేవగానే వర్కౌట్ చేసేటప్పుడు మీకు నచ్చిన మ్యూజిక్ వింటూ ఉంటే మీలో వర్కౌట్ చేసే సామర్థ్యం అంతకంతకూ పెరుగుతుంది.
Details
యాంగ్జాయిటీని దూరం చేసే మ్యూజిక్
తక్కువ తినేలా చేస్తుంది
బ్యాక్ గ్రౌండ్ లో మెలోడీ మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు మీరు భోజనం చేస్తుంటే, అతిగా తినే అలవాటు తగ్గిపోయి తక్కువగా తినడం మొదలు పెడతారు. దీనివల్ల మీ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
మీ మూడ్ పెంచుతుంది
మ్యూజిక్ వినేటప్పుడు మెదడులో డోపమైన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీని వల్ల యాంగ్జాయిటీ, డిప్రెషన్ వంటి లక్షణాలు తగ్గిపోతాయి. అందువల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారిపోయి హ్యాపీగా ఉంటుంది.
మతిమరుపును తగ్గిస్తుంది
ఒకానొక పరిశోధనలో వెల్లడైన ప్రకారం, ఆల్జీమర్స్ తో బాధపడేవారిలో మ్యూజిక్ వినడం వల్ల తమ జీవితంలోని జ్ఞాపకాలు గుర్తు వచ్చాయని తెలిసింది. అంటే మతిమరుపును తగ్గించే ఔషధం లాగా మ్యూజిక్ పనిచేస్తుందన్నమాట.