NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / అన్ని పనులు మానేసి బెడ్ మీదే ఎక్కువసేపు నిద్రపోవడమనే ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్ గురించి విన్నారా? 
    తదుపరి వార్తా కథనం
    అన్ని పనులు మానేసి బెడ్ మీదే ఎక్కువసేపు నిద్రపోవడమనే ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్ గురించి విన్నారా? 
    సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బెడ్ రాటింగ్

    అన్ని పనులు మానేసి బెడ్ మీదే ఎక్కువసేపు నిద్రపోవడమనే ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్ గురించి విన్నారా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 15, 2023
    04:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెడ్ రాటింగ్.. ఏ పనీ చేయకుండా ఎక్కువ సేపు బెడ్ పైనే ఉండడం అన్నమాట. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండులో ఉన్న ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం.

    వారం రోజులు పనిచేసిన తర్వాత ఒకరోజు మొత్తం బెడ్ మీద నుండి లేవకుండా బాధ్యతలను గాలికి వదిలేసి పడుకుంటే శరీరంలో కొత్త ఉత్తేజం వస్తుందని కొందరు చెప్పుకుంటున్నారు.

    జాబ్ చేసేవాళ్ళకు మానసిక ప్రశాంతత లభించేందుకు బెడ్ రాటింగ్ అనేది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

    దీన్నొక సోమరితనంగా అభివర్ణించకుండా తమ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి చేసే ప్రాక్టీస్ అని చెబుతున్నారు. బెడ్ రాటింగ్ పై వస్తున్న వీడియోలకు సోషల్ మీడియాలో వ్యూస్ పెరిగిపోతున్నాయి.

    Details

    ఎక్కువ సేపు నిద్రపోతే వచ్చే అనారోగ్యాలు 

    ఇప్పటివరకు 305మిలియన్ల మంది బెడ్ రాటింగ్ వీడియోలను సోషల్ మీడియాలో చూసారు. చాలామంది బెడ్ మీద ఎక్కువ సేపు ఏ పనీలేకుండా పడుకోవడానికి సమర్థించడం లేదు. ముఖ్యంగా వైద్యులు ఈ విషయమై కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

    అతినిద్ర వల్ల డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులు, స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు, ఏ విషయంలోనూ ఆసక్తి లేకపోవడమనే సమస్య పెరిగిపోయి డిప్రెషన్ కు దారి తీసే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

    బరువు పెరగడం అనేది అదనంగా భరించాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు.

    ఏ పనీ చేయకుండా ఎక్కువసేపు నిద్రపోవడమనే కాన్సెప్టు చాలా పాతదని కొంతమంది అంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    జీవనశైలి

    వైద్యశాస్త్రంలో సరికొత్త సర్జరీ: కడుపులో ఉన్న శిశువుకు మెదడు ఆపరేషన్ చేసిన వైద్యులు  లైఫ్-స్టైల్
    ఆరోగ్యాన్ని అందించే లీచీ పండ్లను సాగు చేస్తున్న ఉత్తరప్రదేశ్ రైతు: వ్యవసాయంలో వినూత్న విప్లవం  లైఫ్-స్టైల్
    ప్రపంచ తలసేమియా డే: ఈ వ్యాధి ఎలా వస్తుంది? దీనికి చికిత్సలు ఏంటి?  లైఫ్-స్టైల్
    ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, రెండు ఏనుగులు కొట్టుకుంటే ఏమంటారో మీరే చూడండి  వైరల్ వీడియో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025