గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బ్లాక్ టీ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది ఇష్టపడే టీ రకాల్లో బ్లాక్ టీ ఒకటి. క్యామెల్లియా సినెన్సిస్ అనే మొక్క నుండి ఉత్పత్తి అయ్యే బ్లాక్ టీ తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. గుండెకు మేలు చేస్తుంది: బ్లాక్ టీలో ఫ్లెవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బీపీని నియంత్రిస్తాయి. అంతేకాదు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గిస్తుంది. అంతేకాదు ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. క్యాన్సర్ రిస్కును తగ్గిస్తుంది: ఇందులో ఉండే పాలీఫినాల్స్ అనే పోషకాలు, క్యాన్సర్ కణాలను ఎదగకుండా చేస్తాయి. అంటే క్యాన్సర్ ను తగ్గిస్తాయని కాదు, క్యాన్సర్ కణతులు ఏర్పడకుండా ఉండేందుకు సహాయం చేస్తాయి.
చురుకుదనాన్ని పెంచే బ్లాక్ టీ
చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది: రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే డయాబెటిస్, కిడ్నీలు పాడవడం, ఊబకాయం, స్ట్రోక్స్, డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకానొక అధ్యయనం ప్రకారం, భోజనం చేసిన తర్వాత బ్లాక్ టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని తెలిసింది. ఫోకస్ పెంచుతుంది: ఇందులో ఉండే ఎల్- థియానిన్ అనే అమైనో ఆమ్లం కారణంగా ఒక పనిలో ఫోకస్ పెరుగుతుంది. అదీగాక చురుకుదనం పెరుగుతుంది. 250మిల్లీ లీటర్ల బ్లాక్ టీ తాగిన వ్యక్తి, ఇతరుల కంటే ఒక పనిని ఎలాంటి తప్పులు లేకుండా చేసాడని అధ్యయనంలో వెల్లడైంది. బ్లాక్ టీలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. దీని కారణంగా జీర్ణసమస్యలు తగ్గుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ బ్లాక్ టీ సాయపడుతుంది.