ఉదయం నుండి సాయంత్రం వరకు మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచే కాఫీ వెరైటీలు
ఈ వార్తాకథనం ఏంటి
పొద్దున్న లేవగానే కాఫీ తాగితే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది.హాట్, కోల్డ్, బ్లాక్.. ఏదైనా సరే కాఫీ తాగడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపరుడుతుంది. శరీర బరువును నియంత్రంచడంలో ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం 4రకాల కాఫీ వెరైటీల గురించి తెలుసుకుందాం.
కోల్డ్ కాఫీ:
వేసవిలో ఈ కాఫీ తాగితే మీరు వెంటనే చల్లబడిపోతారు. కోల్డ్ కాఫీ తయారీలో ఎస్ ప్రెసో, పాలు, కండెన్స్డ్ పాలు, పిండిగా చేసిన ఐస్ కలుపుకుని తాగితే అద్భుతంగా ఉంటుంది.
పుదీనా కాఫీ:
నోటి దుర్వాసన పోవాలంటే పుదీనా కాఫీ తాగండి. ఇందులో ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. మీ అలసటను దూరం చేయడంలో పుదీనా ఉపయోగపడుతుంది.
Details
కాఫీకి పండ్ల రుచిని అందించే ఐస్ స్ట్రాబెర్రీ
మోచా కూలర్:
ఒక పాత్రలో డార్క్ చాక్లెట్, బ్లాక్ కాఫీ వేసి వేడి చేయాలి. ఆ తర్వాత పాలు కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో ఉంచాలి. కాసేపయ్యాక బయటకు తీసి క్రీమ్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు దాన్ని గ్లాసుల్లో పోసి చాక్లెట్ ఐస్ క్రీమ్ తో అలంకరించి అందరికీ ఇవ్వండి.
ఐస్ స్ట్రాబెర్రీ:
కాఫీకి పండ్ల రుచిని జోడించి రుచి చూడాలనుకుందా? ఐస్ స్ట్రాబెర్రీ ట్రై చేయండి. స్ట్రాబెర్రీ ముక్కలు, చక్కెర, నీళ్ళను ఒక పాత్రలో వేసి మరిగించాలి. ఇప్పుడు దాన్ని వడబోసి పక్కన పెట్టి ఐస్, స్ట్రాబెర్రీ సిరప్ కలపాలి. ఆ తర్వాత చల్లని పాలు, కాఫీ పౌడర్ కలిపి తాగాలి.