Page Loader
ఏదైనా విషయంలో మీరు అతిగా ఆలోచిస్తున్నారా? బయటపడటానికి ఈ టెక్నిక్స్ ఉపయోగించండి 
అతిగా ఆలోచించడం నుండి బయటపడే మార్గాలు

ఏదైనా విషయంలో మీరు అతిగా ఆలోచిస్తున్నారా? బయటపడటానికి ఈ టెక్నిక్స్ ఉపయోగించండి 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 15, 2023
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒక చిన్న సమస్య రాగానే దానివల్ల పెద్ద నష్టమేదో జరగబోతుందని ఆలోచిస్తూ మనసులో రకరకాల భయాలను పెంచుకుంటూ పోతుంటే మీరు అతిగా ఆలోచిస్తున్నారని అర్థం. అతిగా ఆలోచించడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు సరికదా, మీలో లేనిపోని భయాలను మిగుల్చుతుంది. ఒకే విషయం పదే పదే ఆలోచించడం, నిర్ణయం తీసుకోకుండా నానుస్తూ ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అతిగా ఆలోచించే లక్షణాల నుండి బయటపడటానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం. గట్టిగా శ్వాస తీసుకోండి: మీ మనసులో ఆలోచనలు ఎక్కువైపోయినపుడు గట్టిగా శ్వాస తీసుకుని వదిలేయండి. రోజులో కనీసం 3సార్లు నిమిషం పాటు గట్టిగా శ్వాస తీసుకుంటూ వదలండి. మీ మనసులో ఆలోచనలు తొలగిపోతాయి.

Details

గత విజయాలను గుర్తు చేసుకోవడంలో దొరికే రిలీఫ్ 

ధ్యానం: అతిగా ఆలోచించే అలవాటు తగ్గాలనుకుంటే రోజూ కొంతసేపు ధ్యానం చేయడం ఉత్తమమైన మార్గం. ఒకరోజులో 5నిమిషాల పాటు ధ్యానం చేస్తే బాగుంటుంది. వేరే విషయాలపై మనసును మళ్ళించండి: ఆలోచనలు ఎక్కువగా వస్తుంటే డైలీ రొటీన్ కాకుండా వేరే విషయాల మీదకు మనసును మళ్ళించాలి. వంటచేయడం, వర్కౌట్ క్లాస్ కి వెళ్ళడం, కొత్త హాబీని అలవర్చుకోవడం చేస్తే రిలీఫ్ దొరుకుతుంది. మీ గత విజయాలను చూసి గర్వపడండి: మీకు వచ్చే నెగెటివ్ ఆలోచనలను పక్కన పెట్టాలంటే గతంలో మీరు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి. వాటిని ఒక పేపర్ మీద రాస్తే మరింత మంచిది. దీనివల్ల మీలో పాజిటివ్ వైబ్రేషన్ చేరి మనసు ప్రశాంతంగా మారుతుంది.