liver Benefits: మటన్, చికెన్ లివర్.. ఆరోగ్యానికి మంచిదా, ప్రమాదమా?
ఈ వార్తాకథనం ఏంటి
నాన్‌వెజ్ అంటే ఇష్టపడని వారంటూ తక్కువే. కొంతమందికి అయితే ముక్క లేనిదే భోజనం పూర్తయ్యిందనే అనిపించదు. ముఖ్యంగా ఆదివారాలు నాన్‌వెజ్ లాగించాల్సిందే.
ఒకప్పుడు వీటిని ముఖ్యంగా ఆదివారాల్లో మాత్రమే తినేవారు. కానీ ఇప్పుడు వారాలకు సంబంధం లేకుండా చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు వంటివి తరచుగా తింటున్నారు.
వీటిలో ముఖ్యంగా చికెన్, మటన్ లివర్ ఎక్కువగా తినేవారు చాలా మందే ఉన్నారు. లివర్ ఫ్రై, లివర్ కర్రీ వంటి వంటకాలు అందరికీ నచ్చేవి.
అయితే చికెన్, మటన్ లివర్ తినడం ఆరోగ్యానికి మంచిదా? దాని వల్ల నష్టమేమైనా ఉందా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Details
చికెన్ లివర్
1. చికెన్ లివర్‌లో విటమిన్ A, B, ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం, సెలీనియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.
2. ముఖ్యంగా సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుంది.
3. ఇది కంటి, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
4. మెదడు చురుకుగా పని చేయడానికి ఉపయోగపడే విటమిన్ B12 ఇందులో పుష్కలంగా ఉంటుంది.
5. గుండె వ్యాధులు, ఫ్యాటీ లివర్ ఉన్నవారు దీన్ని మితంగా తినాలి.
6. కిడ్నీ సమస్యలు ఉన్నవారు లివర్ తినకుండా ఉండటం మంచిది.
7. జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బరం, విరేచనాలు కలిగించే అవకాశం ఉంది.
8. గర్భిణులు పాలిచ్చే తల్లులు కూడా డాక్టర్ సూచనలతో మాత్రమే తినాలి.
Details
మటన్ లివర్
1. మటన్ లివర్ మటన్‌లో అత్యంత పోషక భాగంగా గుర్తిస్తారు.
2. ఇందులో ఐరన్, పొటాషియం, రాగి, జింక్, విటమిన్ A, B, D పుష్కలంగా ఉంటాయి.
3. రక్తహీనతను నివారించడంలో మటన్ లివర్ కీలక పాత్ర పోషిస్తుంది.
4. ఇందులో ఉండే ఖనిజాలు, ఎంజైమ్‌లు రసాయన ప్రక్రియలను సమతుల్యం చేస్తాయి.
5. రోగనిరోధక శక్తిని పెంపొందించే విటమిన్ B12 ఇందులో అధికంగా ఉంటుంది.
6. నరాల బలహీనత సమస్యలతో బాధపడేవారికి మటన్ లివర్ మంచిది.
Details
మటన్ లివర్ తినడం వల్ల కలిగే నష్టాలు
1. గర్భిణీలు ఎక్కువ మటన్ లివర్ తింటే పిండంలో నాడీ వ్యవస్థ సమస్యలు, గుండె సంబంధిత లోపాలు ఏర్పడే అవకాశముంది.
2. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు దీన్ని తినకూడదు.
3. గుండె జబ్బులు, ఆస్తమా సమస్యలున్నవారు మటన్ లివర్‌కు దూరంగా ఉండటం మంచిది.
ముగింపు
చికెన్, మటన్ లివర్ పోషకాలు కలిగినా వాటిని మితంగా మాత్రమే తీసుకోవాలి. గుండె సమస్యలు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు వీటిని పూర్తిగా నివారించాలి.
ఆరోగ్య పరిస్థితులను బట్టి వైద్యుల సూచనల మేరకు మాత్రమే లివర్ తినడం ఉత్తమం.