NailTrends: వాలెంటైన్స్ డే కోసం అందమైన నెయిల్ ఆర్ట్ ఐడియాస్
ఈ వార్తాకథనం ఏంటి
అందమైన గోర్లు మహిళల అందాన్ని పెంచేందుకు పని చేస్తాయి. ఈ వాలెంటైన్స్ డే కి మీ చేతి గోర్లును అందంగా తీర్చిదిద్దుకోండి.
నెయిల్ ఆర్ట్ క్లిష్టంగాకనిపించినా, కానీ మీరు ఇంట్లోనే సింపుల్‌గా మీ గోళ్లకు అందమైన రూపాన్ని సులభంగా ఇవ్వవచ్చు.
ఇప్పుడు, క్లాసిక్ రెడ్స్ నుండి ఎమోజి-ప్రేరేపిత స్టైల్స్ వరకు కొన్ని వాలెంటైన్స్ డే నెయిల్ డిజైన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Nail trend 1
హార్ట్ ఫ్రెంచ్ టిప్ నెయిల్స్
ఫ్రెంచ్ టిప్స్ కానీ ఇవి గుండె ఆకారంలో ఉంటాయి. మీ గోరు బేస్‌లో, డిటైలింగ్ బ్రష్‌తో హార్ట్ ఆకారాన్ని వేయండి.
ఈ హార్ట్ ఆకారం గల నెయిల్ ఆర్ట్ వాలెంటైన్స్ డేకి లేదా ఎప్పటికప్పుడు స్టైల్ గా ఉండేందుకు పర్ఫెక్ట్ గా ఉంటుంది.
ఫ్రెంచ్ మెనుక్యూర్ మీకు సరళమైన ,సొగసైన రూపాన్ని కూడా అందిస్తుంది. ఇంట్లో కుదరకపోతే పార్లర్ కి వెళ్లి పూర్తి చేసుకోవచ్చు.
Nail trend 2
ఓంబ్రే వాలెంటైన్స్ డే నెయిల్స్
సాంప్రదాయ హార్ట్ డిజైన్ల కాకుండా ఓంబ్రే వాలెంటైన్స్ డే నెయిల్స్‌తో చిక్ ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆకర్షణీయమైన పింక్ షేడ్స్ నుండి ఎంచుకోండి.
ఇది చూడడానికి ఆధునికంగా ఉండడమే కాదు ఆకర్షించే విధంగా ఉండాలనుకుంటే గ్రేడియంట్ షేడ్స్ ట్రై చేయండి.
Nail trend 3
మెటాలిక్ లవ్ ఎఫైర్
మరింత గ్లాసీ లుక్‌ని సొంతం చేసుకోడానికి మెటాలిక్ నెయిల్ పాలిష్ తో హార్ట్ షేప్ వేసుకోండి.
అద్దంలా మెరిసిపోయే ఈ నెయిల్ ఆర్ట్ మీ గోళ్లకు సరికొత్త లుక్‌ని అందిస్తుంది.
అయితే కాస్త సింపుల్ లుక్‌ని కోరుకునే వాళ్లు.. గోళ్లకు సాధారణ నెయిల్ పాలిష్ వేసుకొని.. గోళ్ల అంచుల వద్ద దానికి మ్యాచింగ్‌గా ఉండే మెటాలిక్ పాలిష్‌తో హంగులద్దచ్చు.