నేషనల్ బేక్ వీక్: మామిడి పెరుగు, బేకింగ్ ఆపిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
అమెరికాలో ఈ వారాన్ని నేషనల్ బేక్ వీక్ గా జరుపుకుంటారు. ఏప్రిల్ 3 నుండి 9వ తేదీ వరకు బేకింగ్ చేసిన ఐటమ్స్ ని ఆహారంలో చేర్చుకుంటారు. ఈ నేపథ్యంలో సరికొత్త బేకింగ్ వెరైటీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బేక్ చేసిన మామిడి పెరుగు: పెరుగును, మామిడి గుజ్జును ఒక పాత్రలో వేయాలి. దీనికి పాలు, కొంత మీగడ కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. దీన్ని బేకింగ్ డబ్బాలో పోసి, దాని చుట్టూ అల్యూమినియం కవర్ ను చుట్టాలి. 180డిగ్రీల సెల్సియస్ వద్ద దాదాపు 35నిమిషాలు ఓవెన్ లో ఉంచాలి. ఆ తర్వాత ఓవెన్ లోంచి తీసి, రెండు గంటల పాటు రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి.
బేక్ చేసిన ఆపిల్, బేక్ చేసిన ఆమ్లెట్ తయారీ
బేకింగ్ ఆపిల్స్: ఆపిల్ పొట్టును, గింజలను తీసి గుజ్జు గుజ్జుగా రెడీ చేసి పెట్టుకోవాలి. చిన్నగా పగలగొట్టిన వాల్ నట్స్, దాల్చిన చెక్క, బ్రౌన్ షుగర్, కొంత వెన్న తీసుకుని ఆపిల్స్ గుజ్జులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు రెండంతస్తుల బేకింగ్ పాత్రను తీసుకుని పై దాంట్లో గుజ్జును మొత్తం వేసి, కింద పాత్రలో వేడినీళ్ళు పోసి బేక్ చేయాలి. బేక్ చేసిన ఆమ్లెట్: బియ్యం ఉడకబెట్టి, నీళ్ళను వేరుచేసి అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాత్ర తీసుకుని గుడ్డులోని తెల్లసొన మాత్రమే కలుపుకుని మిర్యాలు, ఉప్పు, పాలు, నచ్చిన కూరగాయలు జోడించి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని అన్నంలో కలుపుకుని బేకింగ్ పాత్రలో పోసి 15నిమిషాలు బేక్ చేస్తే చాలు.