
నేషనల్ బీర్ డే: బీర్ ని ఉపయోగించి తయారు చేసుకోగలిగే ఆహారాలేంటో చూద్దాం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఏప్రిల్ 7వ తేదీని నేషనల్ బీర్ డే గా జరుపుకుంటారు. బీర్ తో తయారయ్యే రెసిపీస్ ని ఆహారంగా తయారు చేసుకుని ఆరగిస్తారు. బీర్ తో ఎలాంటి రెసిపీస్ తయారు చేసుకోవచ్చో చూద్దాం.
బీర్ తిరమిసు:
గుడ్లు, చక్కెర, క్రీమ్ ఛీజ్ ఒక పాత్రలో కలిపి మంచి పేస్ట్ లాగా తయారు చేయండి.
ఒక గ్లాసు తీసుకుని అందులో పూర్తిగా బీరు పోసి, ఆ గ్లాసులో లేడీఫింగర్ కుకీస్ ని నానబెట్టండి.
కుకీస్ నానగానే వాటిని బయటకు తీసి, మనం తయారు చేసుకుని పేస్ట్ ని వీటిమీద పోయాలి.
ఇప్పుడు ఆ గ్లాస్ ని రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి. కోకో పౌడర్ ని జల్లుకుని హ్యాపీగా తినేయడమే.
రెసిపీస్
బీర్ తో తయారయ్యే రెసిపీస్
బీర్ తో చిల్లీ చికెన్:
ఒక పాత్రలో ఆలివ్ ఆయిల్ పోసి, ఉల్లిగడ్డలు, వెల్లుల్లి వేసి వేయించాలి.
ఇప్పుడు చికెన్ ముక్కలను చిన్నగా కోసి పాత్రలో వేయండి. ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర, ఒరెగానో వేసి కొంతసేపు వండండి.
ఆ తర్వాత టమాట ముక్కలు, టమాట సాస్, బీర్, పోసి తక్కువ మంటలో ఉంచండి. రెడీ కాగానే హ్యాపీగా ఆరగించండి.
బీర్ లో ముంచిన ఉల్లిపాయ రింగులు:
మీకు ఆనియన్ రింగ్స్ ఇష్టమైతే ఈ రెసిపీ ట్రై చేయండి.
పిండి, ఉప్పు, మిరియాలు, గుడ్లను ఒక పాత్రలో వేసి బాగా కలపండి.
ఇప్పుడు బీర్ పోసి చిక్కని పిండిముద్ద తయారు చేయండి.
ఇప్పుడు ఉల్లిపాయ రింగులను పిండిముద్దలో ముంచి నూనెలో ఫ్రై చేయండి.