పంచదార పాకంతో ఈజీగా తయారయ్యే ఆహారాల గురించి తెలుసుకుందాం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఏప్రిల్ 5వ తేదీని జాతీయ క్యారమెల్ దినోత్సవంగా జరుపుకుంటారు. అంటే పంచదార పాకంతో తయారయ్యే వంటకాలను తయారు చేసుకుని ఆరగిస్తారు.
ఈ సందర్భంగా పంచదార పాకంతో ఈజీగా తయారయ్యే రెసిపీస్ గురించి తెలుసుకుందాం.
బ్రెడ్ పాప్ కార్న్:
బ్రెడ్ తీసుకుని వాటి చివర్లు తీసేసి, బ్రెడ్ ని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను వేయించాలి.
ఇప్పుడు చక్కెర, నీళ్ళను ఒక పాత్రలో పోసి పొయ్యి మీద వేడి చేసి పంచదార పాకం తయారు చేయాలి. ఈ పాకం గట్టిపడుతున్నప్పుడు పాలు, వెన్న, బ్రెడ్ ముక్కలను వేయాలి. వీటిని బాగా మిక్స్ చేసి మరో పాత్రలోకి తీసుకుని మీకు కావాల్సిన వారికి వడ్డించండి.
రెసిపీస్
క్యారెమెల్ తో తయారయ్యే నోరూరించే రెసిపీస్
సాల్టెడ్ క్యారమెల్ పై:
బిస్కట్ ముక్కలు, వెన్న, చక్కెర బాగా కలిపి ఫ్రిజ్ లో ఉంచాలి.
చక్కెర, నీళ్ళను మరిగించి పాకం తయారు కాగానే వెన్న,క్రీమ్ ఛీజ్,ఉప్పు కలపండి.
ఈ మిశ్రమాన్ని బిస్కట్ మిశ్రమం మీద పోసి, ఒకరాత్రి ఫ్రిజ్ లో ఉంచితే చాలు.
క్యారమెల్ కుకీస్:
ఓవెన్ 190డిగ్రీల సెల్సియస్ లో వేడి చేయండి.
ఒక పాత్రలో చక్కెర,వెన్న,గుడ్లు, వెనీలా కలిపి క్రీమ్ అయ్యేవరకు బాగా మిక్స్ చేయాలి.
మరో పాత్రలో పిండి, ఉప్పు, బేకింగ్ సోడా కలిపి, రెండు పాత్రల్లోని పదార్థాలను మిక్స్ చేయండి.
ఆ పిండిముద్దకు చాక్లెట్ చిప్స్, క్యారెమెల్ చిప్స్ కలిపి పొయ్యిమీద ఉంచండి.
ఇప్పుడు ఆ పిండిముద్దతో కుకీస్ చేసి 10నిమిషాలు బేక్ చేస్తే సరిపోతుంది.