
నేషనల్ కార్న్ డాగ్ డే: అదిరిపోయే రుచిగల ఫ్రై ఆహారాలను ఇప్పుడే ట్రై చేయండి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ సంవత్సరం అమెరికాలో మార్చ్ 18వ తేదీని నేషనల్ కార్న్ డాగ్ డే గా జరుపుకుంటారు. కార్న్ తో చేసిన ఆహారాలను హాట్ డాగ్స్ తో కలిపి తినేవాటిని కార్న్ డాగ్స్ అంటారు.
ఈ కార్న్ డాగ్స్ ని ఇంట్లోనే తయారు చేయవచ్చు. అదెలాగో చూద్దాం.
క్లాసిక్ కార్న్ డాగ్:
మొక్కజొన్న పిండి, చక్కెర, బేకింగ్ పౌడర్, కొంత ఉప్పు, కొంత మిరియాల పొడి.. అన్నింటినీ బాగా కలపాలి. ఆ తర్వాత పాలు, గుడ్లు కలిపి బాగా కలపాలి.
ఇప్పుడు హాట్ డాగ్స్ లేదా పోర్క్ ఫ్రాంక్స్ తీసుకుని వాటిని పిండిలో ముంచేసి నూనెలో ఫ్రై చేయాలి. ఆ తర్వాత టమాట సాస్ లేదా మీకు నచ్చిన సాస్ తో హ్యాపీగా ఆరగించండి.
రెసిపీస్
బీర్ తో తయారయ్యే కార్న్ డాగ్స్
కార్న్ డాగ్ మఫిన్స్:
మైక్రోవేవ్ ని 200డిగ్రీల సెల్సియస్ లో వేడి చేయండి. మఫిన్ పాత్రలకు నూనె రాయాలి.
ఆ తర్వాత కార్న్ బ్రీడ్, బ్రౌన్ షుగర్, ముక్కలుగా చేసిన హాట్ డాగ్స్, గుడ్లను ఒక పాత్రలో వేసి అందులో పాలను పోసి మిశ్రమం తయారు చేసి మఫిన్ పాత్రల్లో పోయాలి.
20నిమిషాల తర్వాత మైక్రోవేవ్ లోంచి తీసేయండి
మినీ బీర్ కార్న్ డాగ్స్:
హాట్ డాగ్స్ ని రెండు ముక్కలుగా చేసి పుల్లలకు అంటించి పెట్టుకోవాలి. కార్న్ మీల్, చక్కెర, ఉప్పు, బేకింగ్ పౌడర్, గుడ్లు, తేనె ఒక పాత్రలో కలిపి దాన్లో బీర్ పోయాలి. ఇప్పుడు హాట్ డాగ్స్ పుల్లలను ఈ మిశ్రమంలో ముంచి, ఆయిల్ లో ఫ్రై చేయాలి.