నేషనల్ మీట్ బాల్ డే: మాంసంతో తయారయ్యే వెరైటీ వంటకాల రెసిపీ మీకోసమే
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా జనాలు ఈరోజు నేషనల్ మీట్ బాల్ డే జరుపుకుంటారు. చికెన్, చేపలు, మటన్, పందిమాంసం మొదలుగు వాటితో ఉండలుగా వంటకాలు రెడీ చేసుకుని హ్యాపీగా ఆరగిస్తారు.
తియ్యగా, పుల్లగా ఉండే మీట్ బాల్స్:
చికెన్, ఉల్లిగడ్డలు, గుడ్లు, కొంచెం ఉప్పు, మిరియాలు, బ్రెడ్ తురుము ఒక పాత్రలో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి నాన్ స్టిక్ పాత్రలో బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి.
ఈ టైమ్ లో కొద్దిగా నీళ్ళు, బ్రౌన్ షుగర్, వెనిగర్, కెచప్, మొక్కజొన్న పిండి, సోయా సాస్ కలిపి సాస్ ని తయారు చేయాలి. ఈ సాస్ ని మీట్ బాల్స్ మీద వేసుకుని తినేయండి.
రెసిపీస్
సరికొత్త మీట్ బాల్స్ తయారు చేసే విధానము
ఇటాలియన్ బేక్డ్ మీట్ బాల్స్:
ఓవెన్ ని 175డిగ్రీల సెల్సియస్ లో వేడి చేయండి. ఒక పాత్రలో ఓట్స్, గుడ్లు, కారం, ఉల్లిగడ్డలు, పాలు, ఉప్పు, మిరియాలు వేసి బాగా కలిపి, ఆ మిశ్రమం నుండి ఉండలు తయారు చేయాలి.
ఆ తర్వాత మరో పాత్ర తీసుకుని కెచప్, వెల్లుల్లి, చక్కెర, ఉల్లిగడ్డ కలిపి సాస్ తయారుచేసి, ఈ సాస్ ని ఉండల మీద పోసి ఓవెన్ లో గంటసేపు బేక్ చేయాలి.
చికెన్ కర్రీ మీట్ బాల్స్:
ఓవెన్ ని 190డిగ్రీ సెల్సియస్ వేడి చేయండి. ఆలివ్ ఆయిల్, అల్లం వెల్లుల్లి, బ్రెడ్ తురుము, చికెన్, మిరియాలు, ఉప్పు కలిపి మిక్స్ చేసి ఉండలు తయారు చేసి 15నిమిషాలు బేక్ చేయండి.