National Education Day 2024: ఈ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కి ఎందుకు అంకితం చేయబడిందో తెలుసుకోండి
ప్రతి సంవత్సరం నవంబరు 11న మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశానికి మొదటి విద్యాశాఖ మంత్రిగా సేవలందించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్థం ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది. ఆయన 1888 నవంబర్ 11న అఫ్గానిస్తాన్‌లోని మక్కాలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ)కు అత్యంత పిన్న వయస్సులో అధ్యక్షుడిగా సేవలందించిన ఆజాద్ స్మారకంగా ఈ రోజు జరుపుకుంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశంలో ఉన్నత విద్యా స్థాపనకు ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. ఆయన దూరదృష్టి వల్ల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు,యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వంటి కీలక సంస్థలు ఏర్పడటం సాధ్యమైంది. ఆజాద్‌ను దేశంలో ఉన్నత విద్యకు ప్రేరణ ఇచ్చిన మహనీయునిగా పరిగణిస్తారు.
అలీఘర్‌లో జామియా మిలియా ఇస్లామియా
ఆజాద్ స్వాతంత్య్ర సమరంలో ఎంతో కృషి చేశాడు. భారతదేశం నిర్మాణంలో ఆయన చేసిన సహకారం అపారంగా ఉండింది. అతనిని స్వతంత్ర భారతదేశపు ప్రధాన వాస్తుశిల్పిగా కూడా అభివర్ణిస్తారు. 1920లో ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జామియా మిలియా ఇస్లామియా స్థాపించడంలో ఆయన కీలకంగా పనిచేశారు. అలాగే, 1934లో ఈ విశ్వవిద్యాలయానికి న్యూఢిల్లీకి తరలింపులో కూడా ఆయన ముఖ్యమైన పాత్రను పోషించారు. ప్రథమ విద్యాశాఖ మంత్రి అయిన ఆజాద్ స్వాతంత్య్రం అనంతరం దేశంలోని పేద కుటుంబాలకు, గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు విద్యను అందించడంపై ఎక్కువ శ్రద్ధ వేశాడు.
విద్యా రంగంలో పలు మార్పులు
వయోజన అక్షరాస్యతను ప్రోత్సహించడం, 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందించడం, సార్వత్రిక ప్రాథమిక విద్యను విస్తరించడం, వృత్తిపరమైన శిక్షణకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన విద్యా రంగంలో పలు మార్పులు తీసుకువచ్చాడు. జాతీయ విద్యా దినోత్సవం మొదట 2008 నవంబర్ 11న నిర్వహించబడింది, అప్పుడు నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం జాతీయంగా ఘనంగా జరుపుకుంటున్నారు.