Page Loader
National Mathematics Day : నేడు గణిత దినోత్సవం.. మానవుని మేధస్సును అత్యున్నత స్థాయికి చేర్చే శాస్త్రమే గణితం
నేడు గణిత దినోత్సవం.. మానవుని మేధస్సును అత్యున్నత స్థాయికి చేర్చే శాస్త్రమే గణితం

National Mathematics Day : నేడు గణిత దినోత్సవం.. మానవుని మేధస్సును అత్యున్నత స్థాయికి చేర్చే శాస్త్రమే గణితం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2023
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజమ్ (Srinivasa Ramanujan) జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటాం. గణితంలో ఆయన చేసిన సేవలను కొనియాడుతూ భారత ప్రభుత్వం 2012 నుంచి డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. మానవుని మేధస్సును అత్యున్నత స్థాయికి చేర్చే శాస్త్రమే గణితం. విద్యావంతుడైనా, నిరక్షరాస్యుడైనా గణితాన్ని ఉపయోగించకుండా జీవితంలో ముందుకెళ్లలేడు. గణితం పట్ల ఆసక్తి పెంచుకుంటే స్వచ్ఛత, కచ్చితత్వం, వేగం, సృజనాత్మకత వంటి లక్షణాలు అలవాడతాయి. శాస్త్రీయ ఆలోచన ధోరణి ఏర్పడి క్రమబద్ధమైన విధానం అలవడుతుంది.

Details

అనారోగ్య సమస్యలతో 32వ ఏట మరణించిన రామానుజమ్

శ్రీనివాస రామానుజన్ డిసెంబర్ 22, 1887న తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించారు. 12 సంవత్సరాల వయస్సులోనే గణితంలోనే రామానుజమ్ మంచి గుర్తింపు పొందారు. 1903లో కుంభకోణంలోని ప్రభుత్వ కాలేజీలో చేరారు. 1903లో మద్రాస్ యూనివర్సిటీ నుంచి స్కాలర్ షిప్ పొందారు. ఇక 1913లో మద్రాస్ పోర్ట్ ట్రస్టుకు వచ్చిన గణిత శాస్త్రవేత్త హకర్ రామానుజమ్ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయారు. రామానుజమ్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను కేంబ్రిడ్జి ఫ్రొఫెసర్ జీహెచ్ హార్డికి పంపారు. రామానుజమ్ అనారోగ్య సమస్యల కారణంగా తన 32వ ఏట లండన్‌లో మరణించారు. బతికింది తక్కువ కాలమే అయినా ఆయన గణితశాస్త్రంలో ఎన్నో కొత్త ఫార్ములాలను అందించారు.