నేషనల్ పీనట్స్ డే: వేరుశనగ పంటలోని మీకు తెలియని వెరైటీలు
ప్రపంచవ్యాప్తంగా వేరుశనగలను పండిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వేరుశనగ రకాన్ని పండిస్తుంటారు. అమెరికాలో సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ వేరుశనగల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ క్రమంలో మీకు తెలియని వేరుశనగల్లోని వెరైటీ ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. రన్నర్ పీనట్స్ వీటిని 1970లో పరిచయం చేశారు. అమెరికాలోని అలబామా, ఫ్లోరిడా, టెక్సాస్ ప్రాంతాల్లో ఈ వేరుశనగ రకానికి మంచి పాపులారిటీ ఉంది. ఈ వేరుశనగలు కోడిగుడ్డు ఆకారంలో కాకుండా గుండ్రంగా ఉంటాయి. ఈ వేరుశనగలతో పీనట్ బట్టర్ తయారు చేస్తారు.
వర్జీనియా పీనట్స్
వర్జీనియా వేరుశనగలు చాలా పొడవుగా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేరుశనగల రకంగా ఈ వెరైటీకి పేరు ఉంది. అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో ఈ వేరుశనగ రకాన్ని ఎక్కువగా పండిస్తారు. స్పానిష్ పీనట్స్: ఈ రకం వేరుశనగలు చాలా చిన్నగా ఉంటాయి. ఎరుపు, గోధుమ రంగుల్లో ఉండే ఈ వేరుశనగ రకాన్ని క్యాండీస్, బట్టర్ తయారు చేయడానికి ఎక్కువగా వాడుతారు. అంతేకాదు, ఈ వేరుశనగ రకంలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీని నుండి నూనె తీస్తారు.
వాలెన్షియా పీనట్స్
సాధారణంగా వేరుశనగ పెంకులో రెండు లేదా మూడు వేరుశనగ గింజలు కనిపిస్తాయి. కానీ వాలెన్షియా వేరుశనగ రకంలో మాత్రం మూడు లేదా అంతకంటే ఎక్కువ వేరుశనగ గింజలు కనిపిస్తాయి. వీటిని వేయించి లేదా ఉడకబెట్టి తింటారు. ఆగ్నేయ అమెరికా ప్రాంతాల్లో ఈ రకం వేరుశనగలు ఎక్కువగా పండిస్తారు. ఇందులో విటమిన్-E ఎక్కువగా ఉంటుంది అందుకే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.