జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం: జంతువులు పెంచుకుంటున్న వారు ఈరోజు చేయాల్సిన పనులు
ఈ వార్తాకథనం ఏంటి
2006లో మొదటిసారిగా జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశంలో ఏప్రిల్ 11వ తేదీన ఈరోజును జరుపుకుంటారు.
జంతు సంరక్షణ సభ్యురాలు కొలీన్ పైజీ కారణంగా జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం మొదలైంది. జాతీయ కుక్కల దినోత్సవాన్ని, పిల్లుల దినోత్సవాన్ని కూడా ఆమె మొదలుపెట్టారు.
పెంపుడు జంతువులను పెంచుకోవడంపై అవగాహన కల్పించేందుకు, నిర్వాసితంగా మిగిలిన జంతువులను ఇంటికి తెచ్చుకుని వాటికి సౌకర్యాలు కల్పించడంపై శ్రద్ధ కలిగేందుకు పెంపుడు జంతువుల దినోత్సవాన్ని జరుపుతారు.
ఈరోజున పెంపుడు జంతువుల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. వాటి అవసరాలు సరిగ్గా తీరుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి.వాటి ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి. ఇంకా వాటికి సరైన ఆహారం అందుతుందా లేదా చెక్ చేసుకోవాలి.
Details
వాకింగ్ కారణంగా పెంపుడు జంతువుల్లో డిప్రెషన్ దూరం
పెంపుడు జంతువుల ఆరోగ్యం విషయంలో, ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదన్న సంగతి గుర్తుంచుకోవాలి. పెంపుడు జంతువులను తెచ్చుకున్న కొత్తలో విపరీతమైన ప్రేమ చూపిస్తారు.
ఆ తర్వాత వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు. ఒక్కసారి ఈ విషయంలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి.
కుక్క, పిల్లిని పెంచుకున్నట్లయితే వాటిని వాకింగ్ కి తీసుకెళ్ళడం వంటివి చేయాలి. ఒకేచోట బంధించినట్లు ఉంటే వాటిలో డిప్రెషన్ పెరుగుతుంది. దానివల్ల పెంపుడు జంతువుల ఆరోగ్యం దెబ్బతింటుంది.
పెంపుడు జంతువుల దినోత్సవం రోజున మీ పెంపుడు జంతువులకు కావాల్సిన వ్యాక్సిన్లు ఇప్పించండి. జంతువులకు ప్రేమను పంచుతూ ఉండండి. అవి మీపై ప్రేమను చూపిస్తూ ఉంటాయి. మీ స్నేహితులకు పెంపుడు జంతువులను పెంచుకునే విషయంలో సాయం చేయండి.