NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / మీ పెంపుడు కుక్కపిల్ల నార్మల్ గా కంటే ఎక్కువ నిద్రపోతుందా? కారణాలు తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    మీ పెంపుడు కుక్కపిల్ల నార్మల్ గా కంటే ఎక్కువ నిద్రపోతుందా? కారణాలు తెలుసుకోండి
    కుక్కపిల్లలు ఎక్కువ నిద్రపోతుంటే దానికి గాల కారణాలు

    మీ పెంపుడు కుక్కపిల్ల నార్మల్ గా కంటే ఎక్కువ నిద్రపోతుందా? కారణాలు తెలుసుకోండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 03, 2023
    02:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మీ కుక్కపిల్ల ఈ మధ్య ఎక్కువగా నిద్రపోతుందా? గతంలో మాదిరి యాక్టివ్ గా ఉండలేకపోతుందా? దీనికి చాలా కారణాలున్నాయి.

    కుక్కపిల్లలు ఒత్తిడి ఫీలవడం దగ్గరి నుండి వాటి ఆరోగ్యం పాడవటం వరకూ అనేక కారణాల వల్ల అవి ఎక్కువ సమయం నిద్రపోతుంటాయి. ప్రస్తుతం ఇక్కడ కొన్ని కామన్ కారణాల గురించి తెలుసుకుందాం.

    మీ పెట్ ముసలిదైతే లేక యవ్వనంలో ఉంటే: సంవత్సరంలోపు కుక్కపిల్లలు ఎక్కువ సేపు నిద్రపోతాయి. కనీసం 12గంటల నిద్ర వాటికి అవసరం. అలాగే కుక్క వయసు పెరుగుతున్న కొద్దీ దాని నిద్రపోయే సమయం కూడా పెరుగుతుంటుంది.

    మానసిక ఇబ్బందులు: ఒత్తిడి, యాంగ్జాయిటీ, బోర్ వల్ల కుక్కలు బద్దకంగా మారతాయి. అందుకే వాటికి డైలీ రొటీన్ అలవాటు చేయాలి.

    పెట్

    కుక్కపిల్లలు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కారణాలు

    థైరాక్సిన్ లోపం: ఇది కూడా కుక్కలు ఎక్కువ సేపు నిద్రపోవడానికి ఒక కారణంగా నిలుస్తుంది. థైరాక్సిన్ హార్మోన్ కావాల్సినంత విడుదల కాకపోవడం వల్ల కుక్కపిల్లల జీవక్రియలో మార్పులు వచ్చి ఆరోగ్యం దెబ్బతింటుంది.

    కొన్ని కుక్కపిల్లల జాతులకు ఎక్కువ నిద్ర అవసరం: మీరు పెంచుకుంటున్న కుక్కపిల్ల బ్రీడ్ మీద దాని నిద్రా సమయం ఆధారపడి ఉంటుంది. సైజ్ లో పెద్దగా ఉండే మస్టిఫ్, స్పేనియల్, గ్రేహౌండ్స్, గ్రేట్ డేన్స్ జాతులకు ఎక్కువ నిద్ర కావాలి.

    మీ కుక్కపిల్లకు జ్వరం రావచ్చు: ఎక్కువ సేపు నిద్రపోవడానికి మరో కామన్ కారణం బాక్టీరియా లేదా వైరల్ జ్వరాలు రావడమే. బాక్టీరియా ఇన్ఫెక్షన్లలో ఒకటైన లెప్టోస్పిరోసిస్ అనేది అంటువ్యాధి. ఒక కుక్క మరో కుక్కకు ఈ వ్యాధి అంటుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పెట్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    పెట్

    పెట్: పెంపుడు కుక్కను దాని తోక ఊపే విధానం ద్వారా అర్థం చేసుకోండి లైఫ్-స్టైల్
    పెంపుడు కుక్కలను అర్థం చేసుకోవాలంటే వాటి నిద్రపోయే పొజిషన్ గురించి తెలుసుకోండి లైఫ్-స్టైల్
    పెట్: కుందేలు పెంచుకుంటున్నారా? దానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో చూడండి లైఫ్-స్టైల్
    పెట్: మీ పెంపుడు పిల్లి మీ దగ్గరకు రావడం లేదా? కారణం తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025