నేషనల్ టీ డే 2023: ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ ఎక్కడ తయారవుతుందో తెలుసా?
ప్రపంచంలో ఎక్కువ మంది తాగే పానీయం టీ అని చెప్పవచ్చు. మరి ప్రపంచ ప్రజలంతా ఎక్కువ శాతం తాగే టీలో చాలా రకాలున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టీ రకాల గురించి తెలుసుకుందాం. డా హాంగ్ పావో - చైనా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టీ ఇదే. కిలోకు 1.2మిలియన్ డాలర్లు ధర ఉంటుంది. ఖనిజ లవణాలు కలిగిన రుచి ఉంటుంది. దీనితో తయారయ్యే టీ, ఎర్రగా ఉంటుంది. 300సంవత్సరాల కాలం నాటి మొక్కల నుండి ఈ టీని తయారు చేస్తారు. పాండా డంగ్ టీ - చైనా: ఈ టీ తాలూకు మొక్క, పాండా పేడ ఎరువు కారణంగా ఎదుగుతుంది. ఒక కిలో టీ, 35,000డాలర్ల ధర ఉంటుంది.
అత్యంత ఖరీదైన టీ లల్లో మరిన్ని రకాలు
పీజీ టిప్స్ డైమండ్ టీ - యునైటెడ్ కింగ్ డమ్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన జాబితాలో ఈ టీకి మూడవ స్థానం దక్కుతుంది. కిలో టీ, 15వేల డాలర్ల ధర ఉంటుంది. పీజీ టిప్స్ అనే బ్రిటీష్ కంపెనీ, ఈ టీ ని తయారు చేస్తుంది. ఈ తేయాకు, ఇండియాలోని మకైబరి టీ తోటల నుండి నుండి బ్రిటన్ వెళ్తుంది. వింటేజ్ నార్సిసస్ - చైనా: కిలోకు 6500డాలర్ల ధర ఉండే ఈ టీ, చైనాలో లభ్యమవుతుంది. దీని సువాసన పూలవలె మధురంగా ఉంటుంది. ఈ తాగడం వల్ల మానసికంగా చురుగ్గా ఉంటారు. పుప్పళ్ళు వంటి సమస్యలు ఏర్పడవు. క్యాన్సర్, గుండె జబ్బుల నుండి రక్షిస్తుందని చెబుతారు.