
నేషనల్ ట్రైగ్లిజరైడ్స్ డే: రక్తంతో ప్రవహించే కొవ్వులాంటి గడ్డల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ ఏడాది మార్చ్ 28వ తేదీన జాతీయ ట్రైగ్లిజరైడ్ డేని జరుపుకుంటారు. అధిక శాతం ట్రైగిల్జరైడ్స్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అవగాహన పెంచుకోవడానికి ఈరోజును జరుపుతారు.
ట్రైగ్లిజరైడ్ అంటే:
కొవ్వు లేదా మైనం మాదిరిగా ఉండే ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో ప్రవహిస్తుంటాయి. శరీరంలో కేలరీలు ఎక్కువైనపుడు, ఆ అధిక కేలరీలు చిన్న చిన్న కొవ్వు కణం మాదిరిగా మారుతుంటాయి. వీటినే ట్రైగ్లిజరైడ్స్ అంటారు.
కొవ్వుకు ట్రైగ్లిజరైడ్స్ కు తేడా
విటమిన్ డి ఉత్పత్తి కావడానికి, శరీరంలో కణాలు తయారు కావడానికి కొవ్వు ఉపయోగపడుతుంది.
ట్రైగ్లిజరైడ్స్ అనేవి శరీరం ఉపయోగించుకోని కేలరీలను నిల్వ చేసి శరీరానికి శక్తిని అందిస్తాయి.
ఐతే ట్రైగ్లిజరైడ్స్ స్థాయిల్లో ఏదైనా తేడా వచ్చిన సమస్య ఏర్పడుతుంది.
ఆరోగ్యం
టైగ్లిజరైడ్స్ అధికంగా ఉంటే కలిగే ఇబ్బందులు
ట్రైగ్లిజరైడ్ సాధారణ స్థాయిలో ఉంటే ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలగదు. అవి ఉండాల్సిన వాటికన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే హార్ట్ అటాక్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
ట్రైగ్లిజరైడ్స్ సాధారణ, అధిక స్థాయిలు
ఒక డెసిలీటర్ కు 150మిల్లీగ్రాముల ట్రైగ్లిజరైడ్స్ ఉంటే అది సాధారణ స్థాయి.
ఒక డెసిలీటర్ కు 200-499మిల్లీగ్రాముల ట్రైగ్లిజరైడ్ ఉంటే అది అధిక స్థాయి.
ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉంటే వచ్చే నష్టాలు:
ఇవి ఎక్కువగా ఉన్నట్లయితే రక్తప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడి, స్ట్రోక్, గుండె సమస్యలు, హార్ట్ అటాక్ వస్తాయి. క్లోమం, కాలేయం వంటి గ్రంధులకు కూడా అధిక ట్రైగ్లిజరైడ్ కారణంగా ఇబ్బంది కలుగుతుంది.
రోజూ అరగంట వ్యాయామం, చక్కెర ఎక్కువ తీసుకోకపోవడం వంటి చేస్తుండాలి.