సింగిల్స్ కోసం ప్రత్యేకమైన ఉంగరం, డేటింగ్ యాప్ లపై గురి
ఈ వార్తాకథనం ఏంటి
సరైన పార్ట్ నర్ కోసం డేటింగ్ యాప్ లో తెగ వెతుకుతున్నారా? ఎంత సెర్చ్ చేసినా మీకు తగిన జోడీ దొరకట్లేదా? అయితే ఈ రింగ్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే.
మీరు సింగిల్ గా ఉన్నారని మిమ్మల్ని చూసేవాళ్ళకు తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైన రింగ్, మార్కెట్ లోకి వచ్చింది. దాని విశేషాలేంటో చూద్దాం.
డేటింగ్ యాప్ లపై గురి పెట్టడానికే:
పియరింగ్ అనే కంపెనీ పియర్ రింగ్ ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ పేజీ @biggestsocialexperiment లో ఈ రింగ్ ని ప్రమోట్ చేస్తుంది.
కెనడాకు చెందిన షాపిఫై అనే ఈ కామర్స్ కంపెనీ, డేటింగ్ యాప్ ల వినియోగం తగ్గించడానికి ఈ రింగ్ ని సపోర్ట్ చేస్తుంది.
పియర్ రింగ్
చుట్టుపక్కల కనిపించే సింగిల్స్ ని గుర్తు పట్టడానికి ఉపయోగపడే రింగ్
లేత నీలంరంగులో ఉండే ఈ రింగ్, పెట్టుకుని బయటకు వెళ్తే, బయటవాళ్ళకు మీరు సింగిల్ గా ఉన్నారని అర్థమవుతుంది. వాళ్ళు కూడా సేమ్ రింగ్ పెట్టుకుంటే, వాళ్ళు సింగిల్ గా ఉన్నారని మీకు అర్థం అవుతుంది.
అలా అవతలి వాళ్ళతో ఈజీగా మాట్లాడే అవకాశం ఉంటుందనీ కంపెనీ చెబుతోంది. ఇప్పటివరకు 91శాతం సేల్స్ జరిగినట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ రింగ్ తీసుకున్నవాళ్ళకు స్పెషల్ ఆఫర్ కూడా ఉన్నాయి. సింగిల్స్ కోసం కంపెనీ నిర్వహించే పార్టీలకు, ప్రోగ్రామ్ లకు ఆహ్వానం ఉంటుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రింగ్ పై పెద్ద చర్చ నడుస్తుంది. చాలామంది నెటిజన్స్, ఈ రింగ్ కాన్సెప్ట్ చాలా బాగుందని కామెంట్లు పెడుతున్నారు.