LOADING...
PhysicsWallah IPO: ఫిజిక్స్‌వాలా ఐపీఓ లిస్టింగ్ రేపే: గ్రే మార్కెట్ ఏం సూచిస్తోంది?
ఫిజిక్స్‌వాలా ఐపీఓ లిస్టింగ్ రేపే: గ్రే మార్కెట్ ఏం సూచిస్తోంది?

PhysicsWallah IPO: ఫిజిక్స్‌వాలా ఐపీఓ లిస్టింగ్ రేపే: గ్రే మార్కెట్ ఏం సూచిస్తోంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎడ్‌టెక్ రంగంలో వేగంగా ఎదుగుతున్న ఫిజిక్స్‌వాలా లిమిటెడ్ ఈక్విటీ షేర్లు రేపు.. నవంబర్ 18, 2025.. దలాల్ స్ట్రీట్‌లో అధికారికంగా లిస్ట్ కానున్నాయి. సబ్‌స్క్రిప్షన్ సమయంలో కనిపించిన సరైన డిమాండ్ నేపథ్యంలో, ఈ షేర్లు బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈ (NSE) ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ ప్రారంభించనున్నాయి. ముఖ్యమైన తేదీలు, సమాచారం సబ్‌స్క్రిప్షన్ వ్యవధి: నవంబర్ 11 - నవంబర్ 13 అలోట్మెంట్ తేదీ: నవంబర్ 14 లిస్టింగ్ తేదీ: నవంబర్ 18, 2025

వివరాలు 

ఫిజిక్స్‌వాలా ఐపీఓ జీఎంపీ—ప్రస్తుతం పరిస్థితి 

లిస్టింగ్‌కు ముందు పెట్టుబడిదారులు ఎక్కువగాచూసేది జీఎంపీ (గ్రే మార్కెట్ ప్రీమియం). ఇది ఐపీఓ లిస్టింగ్ ధరకుగురించి ముందస్తు సంకేతాలు ఇస్తుంది. ఇప్పటి జీఎంపీ: మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, ఫిజిక్స్‌వాలా ఐపీఓ జీఎంపీ ఒక్కో షేరుకు ₹9 వద్ద ఉంది. అర్ధం: గ్రే మార్కెట్‌లో షేర్, ఇష్యూ ధరపై అదనంగా ₹9 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. దీని ఆధారంగా, అంచనా లిస్టింగ్ ధర: ₹118 (ఇష్యూ ధర ₹109 + జీఎంపీ ₹9) అంటే, ఈ షేరు 8% కంటే ఎక్కువ ప్రీమియంతో మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది.

వివరాలు 

ఐపీఓ పరిమాణం,ఇతర ముఖ్య వివరాలు 

ఫిజిక్స్‌వాలా మెయిన్‌బోర్డ్ ఐపీఓ మొత్తం ₹3,480.71 కోట్లు సమీకరించింది. ఇందులో: ₹3,100.71 కోట్లు విలువైన 28.45 కోట్ల షేర్లు - ఫ్రెష్ ఇష్యూ ₹380 కోట్లు విలువైన 3.49 కోట్ల షేర్లు - ఆఫర్ ఫర్ సేల్ (OFS) ధరల బ్యాండ్: ₹103 - ₹109 ప్రతి షేరుకు సబ్‌స్క్రిప్షన్ పరిస్థితి (NSE డేటా ప్రకారం) మొత్తం సబ్‌స్క్రిప్షన్: 1.81 రెట్లు QIBs: 2.70 రెట్లు రిటైల్ ఇన్వెస్టర్లు (RIIs): 1.06 రెట్లు NIIs: 0.48 రెట్లు (48%) లీడ్ మేనేజ్‌మెంట్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్: కోటక్ మహీంద్రా క్యాపిటల్ కో. లిమిటెడ్ రిజిస్ట్రార్: MUFG ఇంటిమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్