
Fennel Seeds Water: బరువు తగ్గాలా? రోగనిరోధక శక్తిని పెంచుకోవాలా? రోజుకు 2 సార్లు సోంపు నీరు తాగండి!
ఈ వార్తాకథనం ఏంటి
భోజనం చేసిన అనంతరం సోంపు గింజలను తినే అలవాటు కొంతమందికే ఉంటుంది. ఇవి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడమే కాకుండా, నోటిని ఫ్రెష్‌గా ఉంచుతాయి.
నోటి దుర్వాసనను తగ్గించడంలోనూ సాయపడతాయి. సోంపు గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
అందుకే ఆయుర్వేద వైద్యులు భోజనం అనంతరం వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.
పలు ఔషధాల తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తారు. అంతేకాదు, సోంపు గింజలతో నీటిని తయారు చేసి తాగడం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
ఇది తయారు చేయాలంటే, ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో తగినన్ని సోంపు గింజలను వేసి బాగా మరిగించాలి. తర్వాత వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగితే మంచిది.
Details
బరువు తగ్గడంలో సాయపడుతుంది
సోంపు గింజల టీ జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంది. ఇది పొట్టలో ఉండే అసౌకర్యాన్ని తొలగిస్తుంది.
ఎక్కువగా భోజనం చేసిన తర్వాత కడుపులో ఉబ్బరం, గజిబిజి అనిపించే సమస్యను తగ్గిస్తుంది. సోంపు గింజలలో కార్మినేటివ్ లక్షణాలు ఉండటంతో ఇది పొట్టను తేలికగా మారుస్తుంది.
అంతేకాదు, సోంపు గింజల టీ తక్కువ క్యాలరీలతో ఉండటంతో బరువు పెరుగుతామనే భయం అవసరం లేదు. పైగా, ఇది తాగిన తర్వాత కడుపు నిండిన భావన కలుగుతుంది.
దీని వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు, తద్వారా ఆహారం తక్కువగా తీసుకోవడం ద్వారా బరువు తగ్గడానికి సాయపడుతుంది.
బరువు తగ్గాలనుకుంటే రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు.
Details
సీజనల్ వ్యాధుల నివారణ
సోంపు గింజల నీటికి సహజసిద్ధమైన డైయురెటిక్ గుణాలు ఉన్నాయి. దీని వల్ల శరీరంలో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లి వాపులు తగ్గుతాయి.
నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C, ఫ్లేవనాయిడ్స్‌ను సమృద్ధిగా కలిగి ఉంటుంది.
ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను నివారిస్తుంది.
సోంపు గింజల్లో విటమిన్ A అధికంగా ఉండటం వల్ల కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
వయస్సు పెరిగేకొద్దీ వచ్చే కంటి సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. కనుక సోంపు గింజలను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.
Details
స్త్రీల ఆరోగ్య సమస్యల నివారణ
డయాబెటిస్ ఉన్నవారికి సోంపు గింజల నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజుకు రెండు పూటలుగా దీనిని తాగితే మెటాబోలిజం మెరుగుపడి షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
అలాగే, రుతుసమయంలో మహిళలు అనుభవించే నొప్పులను తగ్గించడంలో సోంపు గింజల నీరు బాగా పనిచేస్తుంది.
దీనిలో యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు ఉండటం వల్ల నొప్పులను తగ్గిస్తుంది. కడుపులో ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
Details
నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది
సోంపు గింజలు యాంటీబాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి నోటిలో దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
దీని వల్ల నోటి దుర్వాసన తగ్గి నోరు తాజాగా మారుతుంది. కనుక రోజూ సోంపు గింజల నీటిని తాగడం వల్ల నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఇలా సోంపు గింజల నీరు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే నిత్యం సోంపు గింజల నీటిని తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.