Neelakurinji flowers: 'నీలకురింజి పూలు'.. తమిళనాడులో 12 సంవత్సరాల తర్వాత కనువిందు
ప్రకృతిలో కొన్ని మొక్కలు అసాధారణ ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన మొక్క 'నీలకురింజి'. ఈ మొక్కలు సాధారణంగా 12 ఏండ్లకు ఒక్కసారి మాత్రమే పూలు పూస్తాయి. ఆ తర్వాత చనిపోతాయి. ఈ మొక్కలు జీవిత కాలంలో ఒకసారి మాత్రమే పూతకు వస్తాయి. కొత్త మొక్కలు విత్తనాలతో పెరుగుతాయి. కానీ వీటికి పూతకు రావడానికి మళ్లీ 12 ఏండ్ల సమయం అవసరం. నీలకురింజి పూలు నీలం రంగులో ఉంటాయి. ఈ మొక్కల పూలు నీలం రంగులో ఉండటం వల్ల వీటికి "నీలకురింజి" అనే పేరు వచ్చింది
నీలకురింజి పుష్పాలను చూసేందుకు తరలిస్తున్న స్థానికులు
తాజాగా, తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలోని పిక్కపాటి గ్రామం వద్దనున్న కొండలపై నీలకురింజి పూలు విరబూశాయి. ఈ ప్రాంతం ఇప్పడు అందమైన నీలకురింజి పూల రేణువుతో కప్పబడి ఉంది, ఇది ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన కళను తెచ్చిపెట్టాయి. నీలకురింజి పుష్పాలను వీక్షించేందుకు చుట్టుపక్కల నుంచి స్థానికులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కొండ మొత్తం నీలకురింజి పుష్పాలతో నిండుగా కన్పిస్తోంది.